ఎన్నడూ లేనంతగా సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..? బ్యాక్ గ్రౌండ్ లో ఇంత స్టోరీ నడిచిందా..??

బిజెపి పార్టీతో చేతులు కలిపి ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. మహమ్మారి ఎఫెక్ట్ కి గత ఆరు నెలల నుండి పవన్ కళ్యాణ్ పూర్తిగా హైదరాబాద్ నగరానికే పరిమితం అయ్యారు. కాగా దసరా తర్వాత కళ్యాణ్ పూర్తిగా ఏపీకి పరిమితం అవ్వడానికి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ లో నుండి పటిష్ట పరచడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Janasena chief Pawan Kalyan escapes unhurt after convoy hits truck in Andhra Pradesh - Oneindia Newsముఖ్యంగా పార్టీలో కొంత మంది నాయకులు పబ్లిక్ తో డీల్ చేసే కొన్ని విషయాల్లో అతిగా స్పందించడంతో వంటి విషయాలు పవన్ దృష్టికి వచ్చినట్లు దీంతో వారిపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో సమర్థులైన నాయకులను గుర్తించి ఇన్చార్జిగా నియమించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి తానే స్వయంగా పర్యవేక్షించి కార్యకర్తలను ప్రోత్సహించడానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా 2022లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ సారి జరగబోయే ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని పవన్ కళ్యాణ్.. రాబోయే సార్వత్రిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.