NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: అన్నకి షాక్.. జగన్ కి బ్రేక్..! ఆ ఒక్క మాటతో సినీ పెద్దల్లో కలవరం..!?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాస్త ముదిరారు.. రాజకీయంగా గతంతో పోలిస్తే మొండిదేరారు.. టీడీపీతో జతకడతారో లేదో సంగతి పక్కన పెడితే వైసీపీకి మాత్రం లొంగడం లేదు. బెదరడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తలొంచడం లేదు.. చివరికి అన్నయినా.., ఎవరైనా సరే జగన్ కి జై కొడుతుంటే సరైన సమయం చూసుకుని సెటైర్లు వేస్తున్నారు.. నిన్న కూడా అదే చేసారు. ఆయన నిన్న నరసాపురంలో చేసిన కామెంట్లు ఇప్పటికీ సినీ వర్గాల్లో.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అటు సీఎం జగన్ ని విమర్శిస్తూనే.. ఇటు అన్నయ్య చిరంజీవిపై సెటైర్ వేశారు..!

Pawan Kalyan: ఏమన్నారు.. ఈరోజు ఏమైంది..!?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న నరసాపురంలో మత్సకార సభకు హజరైయ్యారు. మత్స్యకారులకు వ్యతిరేకంగా వచ్చిన జివో 217కి వ్యతిరేకంగా నరసాపురంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ వేదికపై నుండి పవన్ కళ్యాణ్ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జీవో గురించి, మత్స్యకారుల సమస్యల గురించి, రాష్ట్రంలో వైసీపీ పాలన గురించి, వైసీపీ చేస్తున్న అవినీతి ఇలా అన్నింటిపై మాట్లాడారు. ఈ సందర్భంలోనే సినిమా టికెెట్ల వ్యవహారాన్ని ప్రస్థావించారు. సినీ పెద్దలు అందరూ సీఎం జగన్ వద్దకు వెళ్లి అభ్యర్ధించిన విషయంపై తన దైన శైలిలో కొన్నిసైటైర్ లు, చురకలు ఎవరికి ఎలా తగాలో అలా తగేలేలా కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన కీలక వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే..”ఎంత పెద్దవారైనా సరే జగన్ గారు మీరు పెద్దలు, మాకు సాయం చేయాలి సార్ అని ఆయన వద్దకు వెళ్లాలి. అప్పుడు ఆయన అహం సంతృప్తి చెందుతుంది. అందరూ తన వద్ద తగ్గారు అన్న తృప్తి కలుగుతుంది. ఎవరి వద్ద డబ్బులు ఉండకూడదు. అందరూ దేహీ అనాలనేదే వైసీీపి వారి ఆలోచనా విధానం. వారు రాచరికంతో వ్యవహరిస్తుంటే ఎలా ఊరుకుంటాం” అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేని గురించి, ఎవరిని ఉద్దేశించి అనేది స్పష్టంగా అందరికీ అర్ధం అవుతుంది. సినీ పెద్దల గురించి సినీ పెద్దల యొక్క ఆర్ధిక లావాదేవీలను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని అనుకుంటోంది. సినిమా ఆటలను కంట్రోల్ చేయడం ద్వారా. అప్పుడు సినిమా వాళ్లు అందరూ సీఎం వద్ద కు వెళ్లి సార్ సార్ అంటూ బతిమిలాడారు.

Pawan Kalyan: Shock to Chiru.. Break to Jagan
Pawan Kalyan Shock to Chiru Break to Jagan

వారిలో అంతరాలోచనలు..!?

నిజానికి కొన్ని రోజుల కిందట హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లు, డైరెక్టర్లు అందరూ వెళ్లి దండం పెట్టి బతిమిలాడుకుని బయటకు వచ్చారు. దానిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎంతో జరిగిన సినీ పెద్దల మీటింగ్ లో చిరంజీవి తగ్గి తగ్గి మాటమాటకు దండం పెడుతూ మాట్లాడుతూ చాలా వినయంగా ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. అందుకే ఈ రకంగా కామెంట్స్ చేశారు అని అనుకోవచ్చు. ప్రజా సమస్యలు తీర్చేందుకు వైసీపీకి అధికారం ఇచ్చారే తప్ప వారిని మరిన్ని సమస్యల్లో నెట్టడానికి కాదని అంటూ జీవో 217కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. లక్షలాది మంది మత్స్యకారులను పొట్టగొట్టేలా వారి కష్టాన్ని దోచుకునేలా తీసుకువచ్చిన 217కి వ్యతిరేకంగా పోరాడాలి. చెరువులు, పంటలు ఆన్ లైన్ చేసి 25 శాతం ముందస్తు చెల్లింపులు చేయాలనేది జీవో ఉద్దేశం.

Pawan Kalyan: Shock to Chiru.. Break to Jagan
Pawan Kalyan Shock to Chiru Break to Jagan

* నరసాపురం సభలో కామెంట్స్ పై ఈరోజు సినీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈరోజు భీమ్లా నాయకు ముందస్తు విడుదల వేడుక జరగాల్సి ఉంది.. కానీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా అది రద్దు చేశారు. ఒకవేళ ఆ మీటింగ్ జరిగి ఉంటె.. ఆ వేదికగా కూడా పవన్ కళ్యాణ్ కచ్చితంగా కీలక కామెంట్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యారట. అందుకే తెలంగాణ మంత్రి కేటీఆర్ ని పిలిచి.. తెలంగాణ ప్రభుత్వం మాకు అండగా ఉంది.. ఏపీలోనే సినిమా రాజకీయాలు నడుపుతున్నారంటూ పవన్ కొన్ని వ్యాఖ్యలు చేయాలనుకున్నారట.. కానీ ఆ వేడుక రద్దవ్వడంతో నిన్న నరసాపురంలో చేసిన వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి. వాస్తవానికి నరసాపురంలో ఏ ఉద్దేశంతో అయితే సభ పెట్టారో దాన్ని హైలేటె చేశారు. దానితో పాటు సీఎం జగన్మోహనరెడ్డి ప్రభావం, సినీ పెద్దలు వెళ్లి సీఎం జగన్ తో మాట్లాడటం, స్వయంగా తన అన్న చిరంజీవి చేతులు కట్టుకుని అయ్యా బాబు అన్నట్లుగా మాట్లాడటం, మీడియా ముందుకు వచ్చి మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి జగన్మోహనరెడ్డిని పొగడటంపై కచ్చితంగా వేదిక చూసుకుని సెటైర్ వేశారు. ఆయన సినీ పరిశ్రమ విషయంలో ఆయన ఎక్కడా తగ్గడం లేదు. ఆయన విధానం బట్టే పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారనేది స్పష్టంగా వెల్లడి అవుతోంది.!

author avatar
Srinivas Manem

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?