NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇక పవన్ కల్యాణ్ రూటే సెపరేటట! రాజకీయాల్లో చెలరేగిపోతారట! ఎందుకీ సడెన్ డెసిషన్?

సొంత పార్టీ జనసేనకు జవసత్వాలు నింపే పనిలో పవన్ కల్యాణ్ పడ్డారు.బిజెపి తనను సైడ్ లైన్ చేస్తోందని పవన్ కల్యాణ్ పసిగట్టేశారు.ఇప్పటికైనా తాను మేలుకోకుంటే వచ్చే ఎన్నికల నాటికి తాను మరింత నష్టపోతానని ఆయనకు జ్ఞానోదయం అయిందంటున్నారు.తాజా పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైసీపీని బీజేపీ బాగా పోత్సహిస్తోంది.

 pavan kalyan sensation decission about politics
pavan kalyan sensation decission about politics

ఈ రోజో రేపో వైసీపీ ఎన్డీయేలో చేరడం, వైసిపికి నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం కల్పించటం జరిగిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. మరోవైపు పవన్ కల్యాణ్ కి బిజెపిలో ఢిల్లీ స్థాయిలో ప్రాధాన్యం కూడా తగ్గిపోయిందట.ఇక పవన్ కల్యాణ్ ‌ తో ఒకనాడు వేదిక పంచుకున్న నరేంద్ర మోడీ ఇపుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడంలేదు. మరో వైపు జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయండని ఎన్నో అభ్యర్ధనలు చేసినబీజేపీ యోధ అమిత్ షా ఇపుడు పవన్ కల్యాణ్ ఊసే తలవడంలేదు.అంతేగాక పవన్ కల్యాణ్ అంటే బిజెపికి చిన్న చూపు కూడా ఉంది.

పవన్ కల్యాణ్ కి సినీ గ్లామర్ ఉంది తప్ప రాజకీయ గ్రామర్ లేదని బిజెపి భావిస్తోంది. పవర్ స్టార్ సినీ గ్లామర్ ను వాడుకొని ఆయనకు రేపటి ఎన్నికల సమయంలో పదో పరకో సీట్లు ఇచ్చి సరి పెట్టేసే పన్నాగం కూడా బీజేపీ నడుపుతోంది.ఇప్పుడిప్పుడే ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి అవగతమవుతున్నాయంటున్నారు.ఇంకా ఆలస్యం చేస్తే తన పార్టీ మరింత వెనక్కు పోగల దని అంచనాకొచ్చిన పవన్ కల్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారని జనసేన వర్గాలు చెప్పాయి.ఇపుడు పవన్ కల్యాణ్ ‌తన పార్టీ మీద శ్రద్ధ పెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారట .

బలమైన టీంతో ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి పవన్ కల్యాణ్ పెద్ద ప్రణాళికే సిద్ధం చేసుకున్నారని ,ఇది నిజంగా శుభపరిణామేనని జనసేన వర్గాలు సంబరపడుతున్నాయి. పన్నెండేళ్లుగా పవన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ,2014 లోనే జనసేన ఆవిర్భవించినప్పటికీ ఈ ఆరేళ్లలో ఆ పార్టీకి పవన్ కల్యాణ్ ఒక రూపాన్ని ఇవ్వలేకపోయారు.ఇంకా చెప్పాలంటే సంస్థాగత నిర్మాణమే లేదు.ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ లోని రాజకీయ నాయకుడు నిద్ర లేచాడని, ఇక జనసేన పార్టీ జనాల్లోకి దూసుకెళుతుందని జన సైనికులు జోష్ తో ఉన్నారు.ఏదేమైనా పవన్ కల్యాణ్ ఇకనైనా నిలకడ రాజకీయాలు చేస్తే నిలదొక్కుకుంటారనడంలో సందేహం లేదు.

author avatar
Yandamuri

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju