టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Vs KTR: కేటీఆర్ వెనుక పీకే..!? ఇది ఆ ముగ్గురి వ్యూహం..!? ఫైనల్ కామెడీ మిస్ అవ్వొద్దు..!

Share

YSRCP Vs KTR: తెలంగాణ మంత్రి.. టీఆరెస్ కీలక నేత కేటీఆర్ వైసీపీ ప్రభుత్వంపై నిన్న ఒక దుమారాన్ని రేపారు.. బీభత్సంగా గాలి వీచి.. వాన కురిసి.. సాయంత్రానికి తీరం దాటినట్టుగా.. రాత్రి మళ్ళీ ఊరటనిచ్చే మరో ట్వీట్ చేశారు. ఒక దేహంపై దెబ్బ తగిలి.. దానికి మందుపూసినా ఆ దెబ్బ మచ్చ మాత్రం శాశ్వతంగానే ఉంటుంది.. సో.. కేటీఆర్ ఈ మాటల వెనుక ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక లేకుండా అయితే జరగదు.. అదేమిటనేది కొన్ని కోణాల్లో పరిశీలిస్తే..

“శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు”.. ఇది అందరికీ తెలిసిన సూత్రం. సేమ్ “ఒక రాజకీయ పార్టీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క నాయకుడయినా ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడు ఏమి చేయమంటే అది చేయాలి, ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టమంటే అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టాలి.. ఎలా ఉండమంటే అలా ఉండాలి.. ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకోవాలి..” పీకే వ్యూహాలు ఇలా ఉంటాయి. ఒకసారి ప్రశాంత్ కిషోర్, ఒప్పందం పెట్టుకుంటే ఆ పార్టీ నేత డ్రెస్ కోడ్ మొదలుకొని వేషధారణ వరకు ఆ ప్రాంతాన్ని బట్టి, ప్రజల ఆలోచన ను బట్టి డిసైడ్ చేస్తుండే వాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంత్రి కేటీఆర్.. ఏపీ సర్కార్ పనితీరు పై పరోక్షంగా చాలా ఖాటుగా విమర్శించారు. దీని వెనుక పీకే ఉండే ఉంటారు..!

YSRCP Vs KTR: గతంలో ఫ్రెండ్స్.. ఇప్పుడు చీకటి ఫ్రెండ్స్..!?

ఇదే కేటీఆర్, అయన తండ్రి సీఎం కెసిఆర్ లు 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా సహకరించారు. ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏపీ సర్కార్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. “పొరుగు రాష్ట్రంలో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసారు. తన స్నేహితుడు ఒకరు సంక్రాతి పండుగకు సొంత ఊరు వెళ్లి వచ్చిన తరువాత ఈ విషయాలు చెప్పాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల నుండి ఊరికి నలుగురు చొప్పున జనాలను ప్రత్యేక బస్సుల్లో పొరుగు రాష్ట్రంకు పంపితే ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో తెలుస్తాయి అని, తద్వారా తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి అర్ధం అవుతుందని తన మిత్రుడు పేర్కొన్నారని” కేటీఆర్ వ్యాఖ్యనించారు. ఏపీ సర్కార్ ను ఇంత అవమానకరంగా కేటీఆర్ మాట్లాడితే.. దానికి ధీటైన విధంగా సమాధానం చెప్పాల్సిన ఏపీ మంత్రులు ఏదో తుతూ మంత్రంగా.. కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి, కేటీఆర్ ఆలా మాట్లాడటం సబబు కాదు అన్నట్లు కౌంటర్ ఇచ్చారు. సబ్జెక్టు తో సూటిగా ఒక్కరూ సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే.. ఇదంతా పీకే ప్లాన్ ప్రకారం జరుగుతోందనే అనుమానాలున్నాయి. ఇప్పటికే పీకే.. టీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఏపీ మంత్రులను రెచ్చ గోడితే రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు వచ్చి తెలంగాణలో సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అన్నది పీకే ప్లాన్ కావచ్చు అనేది విశ్లేషకుల వాదనలు!

గతంలో కూడా దుబ్బాక ఎన్నికల సమయంలో…!

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చ గొట్టేందుకు టీఆర్ఎస్ నీటి వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. స్వయంగా కేసీఆర్ నీటి వివాదంపై మాట్లాడగా, మంత్రి నిరంజన్ రెడ్డి ఏకంగా వైఎస్ఆర్ ను నీటి దొంగ గా విమర్శించారు. ఎన్నికలు అయి పోయిన తరువాత ఏపీ ని విమర్శించడం మానుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేడి రాజు కుంటున్న తరుణంలో మళ్ళీ సెంటిమెంట్ రాజేసేందుకు ఈ తరహా ప్లాన్ తీసుకుని వచ్చారు. దీని వల్ల ఏపీలో వైసీపీ కీ ఉప యోగం ఉంటుంది. రాష్ట్రం లో ఉన్న ఇష్యూస్ పక్క దారి పట్టి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి వైసీపీ కి అవకాశం ఏర్పడుతుంది. అటు తెలంగాణలో టీఆర్ఎస్ కి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి వ్యూహకర్త గా ఉన్న పీకే స్ట్రేటజీలో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. సో.. ఇవన్న్నీ అయిన తర్వాత సాఫీగా కేటీఆర్ మళ్ళీ రాత్రి ఒక ట్వీట్ చేసారు. “అదేదో ఫ్లోలో.. ఆ సమయంలో మాట్లాడేసాను. ఏపీ మంచి నాయకత్వంలో దూసుకెళ్తుంది” అని మసిపూసారు..!

ఫైనల్ కామెడీ మిస్ అవ్వొద్దు..!

ఈ తతంగంలో మొత్తంలో మంత్రి సీదిరి అప్పలరాజు కామెడీ మాత్రం మిస్ అవ్వకూడదు.. తెలంగాణ కంటే ఏపీనే అన్నివిధాలా అభివృద్ధి చెందింది అని చెప్పుకున్న మంత్రి.. “కరోనా సమయంలో దాదాపు 4 వేల మంది ట్రీట్మెంట్ కోసం తెలంగాణ నుండి ఏపీకి వచ్చారని బదులిచ్చారు.. కానీ వాస్తవాలేమిటో.. కరోనా సోకినా వెంటనే తెలంగాణలోని హైదరాబాద్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకున్న సహచర వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు” తెలియాలి..! అన్నీ తెలిసి మంత్రి చేసిన కామెంట్ కామెడీ కాకపోతే ఇంకేమిటి..!?


Share

Related posts

KCR : ఈ ఆంధ్రా అభిమానులు జన్మదిన గిఫ్ట్‌కు కేసీఆర్ ఫిదా..!!

somaraju sharma

జూపూడి మేటర్ లో జగన్ వైఖరి దేనికి సంకేతం? పార్టీ మారి తిరిగివస్తే అంతే సంగతులా??

Yandamuri

Tirupati Bypoll : తిరుపతిలో బీజేపీ తీరు..! అభ్యర్ధి ప్రకటన లేకుండా ప్రచార కమిటీ..!?

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar