NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress YSRCP Alliance: పీకే ప్లాన్ – కాంగ్రెస్ తో పొత్తు..! వైసీపీలో భిన్న స్వరాలు..!

Congress YSRCP Alliance: ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల వ్యూహకర్త అని మాత్రమే అనుకుంటే పొరపాటు.. ఆయన పార్టీలను పరోక్షంగా నడిపించే సారధి.. రథంపై కూర్చునేది పార్టీల అధినేతలైతే.. రథాన్ని తొలిది ఈ ప్రశాంత్ కిషోర్.. రాన్రాను పీకేకి ఈ ప్రాంతీయ పార్టీల అధినేతలు (కొందరు సీఎంలు) ఓ విధంగా లోకువయిపోయారు..! ఆయన గెలిపించాడని మమకారమొ.. ఆయన ఏదైనా చేయగలదని ధీమానో కానీ పీకే ఏం చెప్పినా వీళ్ళెవరూ కాదనలేరు. ఆ చొరవతోనే ఇప్పుడు పీకే ఒక బాంబ్ వేశారు. 2011లో జగన్ ధిక్కరించేసి.. బయటకు వచ్చిన కాంగ్రెస్ తో మళ్ళీ వైసీపీని కలిపేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు ఈ పీకే.. ఈ అంశం వైసీపీలో భిన్న స్వరాలకు తావిస్తుంది..!

Congress YSRCP Alliance: పీకే పీపీలోనే మొత్తం కథ..!

ప్రశాంత్ కిషోర్ నిన్న కాంగ్రెస్ పెద్దలకు ఒక పీపీ (పవర్ పాయింట్ ప్రెజెంటేషన్) ఇచ్చారు. దీనిలోనే చాలా సీక్రెట్లున్నాయి. ఏ రాష్ట్రాలలో ఏ విధంగా కాంగ్రెస్ పోటీ చేయాలి.. పొత్తుల అంశాలేమిటి..? ఆయ రాష్ట్రాల్లో 2019 ఓట్లు లెక్కలేమిటి..!? ప్రాంతీయ పార్టీల బలం, బీజేపీ బలం.., కాంగ్రెస్ బలాలు ఎలా ఉన్నాయి..!? ఆ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి..? అనే అంశాలతో కూడిన పీపీ ఇచ్చారు. దీనిలో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని స్పష్టంగా సూచించారు. సో.. ఇదే ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో టాక్ గా మారింది. కాంగ్రెస్ నుండి వైసీపీలోకి దూకిన వారు సరే.. మంచిదేలే అంటూ ఆనందిస్తుండగా.., కాంగ్రెస్ అంటే గిట్టని వైసీపీ వాళ్ళు మాత్రం వద్దు బాబోయ్ అంటున్నారు.. అన్నిటికంటే ముఖ్యంగా “ఏపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. రాష్ట్ర విభజన కోపం ఏపీలో ఇప్పటికీ ఉంది. సో.. కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లడం వైసీపీకి నష్టం” అంటూ కొందరు లెక్కలు వేస్తున్నారు.. సో.. వైసీపీలో ఒక క్లారిటీ అయితే లేదు.. కానీ సీఎం జగన్ మాత్రం ఈ అంశంపై నేరుగా పీకేతో ఒకసారి మాట్లాడదాం అన్నట్టు తెలిసింది..!

పీకే భేటీ త్వరలో..!?

ప్రస్తుతం ఏపీలో వైసీపీకి కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్నారు.. జగన్ దగ్గర పీకే టీం పని చేస్తుంది.. ఏపీలో మళ్ళీ వైసీపీని గెలిపించే కాంట్రాక్టు పీకే చేతిలో ఉంది. ఇక్కడ ఎలాగా జగన్ కి పీకే వ్యూహకర్త కాబట్టి.. అక్కడ కాంగ్రెస్ తో కలపడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు..! కాకపోతే కాంగ్రెస్ వలన వైసీపీకి లాభం ఏమి లేకపోగా.., నష్ట భయం వెంటాడుతుంది..! అన్నిటికీ మించి వైసీపీ ప్రస్తుతం బీజేపీతో అనధికార పొత్తు కొనసాగిస్తుంది. బీజేపీ విషయంలో రాజకీయంగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సో.. ఈ క్రమంలో బీజేపీతో తెగదెంపులు చేసుకుని.. సీఎం జగన్ కాంగ్రెస్ తో చేతులు కలుపుతారని ఊహించలేం. అదే జరిగితే బీజేపీ కూడా చూస్తూ ఊరుకోకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కేసులను కెలుకుతున్నట్టే.. ఏపీలో కూడా నాటి కేసులను కెలికినా ఆశ్చర్యం లేదు. సో.. వైసీపీ కాంగ్రెస్ పొత్తు అంత సులువైన అంశం కాదు. చాలా లోతుంటాయి.. చాలా చర్చలుంటాయి.. వాటి కోసం త్వరలోనే సీఎం జగన్ తో పీకే భేటీ జరగనున్నట్టు సమాచారం..!

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju