మంత్రులతో మోదీ భేటీ

ఢిల్లీ, డిసెంబరు27: బిజెపిని మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టేందుకు రైతురుణమాఫీపైన ప్రధానమంత్రి మోదీ కసరత్తు ప్రారంభించారు. బుధవారం రాత్రి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ, వ్యవసాయశాఖామంత్రి రాధామోహన్‌సింగ్, పార్టీ అధ్యక్షులు అమిత్‌షాలతో మోదీ రెండుగంటలకుపైగా చర్చించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాల మాఫీని అమలు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి రైతు రుణమాఫీపై త్వరలో ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.