NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విశాఖలో రైల్వే జోన్ ప్రకటిస్తారా?

YS Jagan: Big Plan to Shift Capital
OLYMPUS DIGITAL CAMERA

ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ ఒకటిన రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. మోదీ ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారు. అధికారిక కార్యక్రమం పెట్టుకుని వస్తున్న ప్రధాని విశాఖలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

బిజెపి కార్యక్రమమైన ఈ సభలో మోదీ నవ్యాంధ్రకు రైల్వే జోన్ ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రెడిట్ తెలుగుదేశం ప్రభుత్వానికి చెందకూడదన్న కారణంతోనే ముందుగా రాష్ట్ర బిజెపి ప్రతినిధిబృందాన్ని రైల్వే మంత్రి దగ్గరకు పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సారధ్యంలో మొన్న రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రైల్వే జోన్ ప్రకటించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఇదంతా ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం జరిగిందేనని అంటున్నారు. రాష్ట్ర విభజన వాగ్దానాల అమలు విషయంలో మోదీ ప్రభుత్వం ఆడిన మాట తప్పిందని ఆరోపిస్తూ ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు ఎలాంటి క్రెడిట్ దక్కకూడదన్నది ఈ వ్యూహం లక్ష్యంగా చెబుతున్నారు.

బిజిపితో తెగతెంపులు చేసుకున్న తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకత్వంపై విరుచుకు పడుతున్నారు. మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దానికి జవాబుగా అన్నట్లు మోదీ ఇటీవల గుంటూరులో బహిరంగసభలో మాట్లాడారు. చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా లోకేష్ తండ్రి అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఆయన చేసిన విమర్శలలో హుందాతనం లోపించిందనీ, ప్రధాని స్థాయి వ్యక్తి అలా విమర్శించడం తప్పనీ రాజకీయవర్గాలలో వినబడింది. ప్రధాని విమర్శ తీరుకు నొచ్చుకున్న చంద్రబాబు తాను నరేంద్ర మోదీ భార్య ప్రస్తావన తీసుకువస్తే ఎలా ఉంటుందని అనకుండా ఉండలేకపోయారు.

తాజాగా కూడా, చేసిన వాగ్దానాల గురించి  మాట్లాడకుండా మళ్లీ తిట్టడానికా ప్రధాని వస్తున్నది అంటూ  చంద్రబాబు ప్రధాని విశాఖ పర్యటనపై వ్యాఖ్యానించారు. గుంటూరు సభలో ప్రధాని విభజన చట్టం హామీల గురించి కనీసం ఒకటి రెండు ప్రకటనలన్నా చేస్తారని బిజెపి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే మోదీ చంద్రబాబుపై విమర్శలకే పరిమితమైపోయారు. ఇప్పుడు విశాఖలోనన్నా ఆయన తమ పరువు నిలుపుతారేమోనని రాష్ట్ర బిజెపి నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొసమెరుపేమిటంటే, ఇంతవరకూ ప్రధాని అధికారిక పర్యటన వివరాలు విశాఖ అధికార యంత్రాంగానికి అందలేదు.

 

author avatar
Siva Prasad

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Leave a Comment