హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ శాసనసభాపతి అభ్యర్ధిగా బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. సాయంత్రం ఐదు గంటలవరకు స్పీకర్ అభ్యర్ధికోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మల్లు భట్టివిక్రమార్క, అహ్మద్ బలాల, సురేఖా నాయక్‌లు పోచారం పేరును బలపరిచిన వారిలో ఉన్నారు.
స్పీకర్ పదవికి కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి కసరత్తు చేపట్టారు.
శుక్రవారం స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.
ఇంజనీరింగ్ చదివిన ఆయన ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
previous post
next post