NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరోనా తర్వాత కదిరి బాబురావు బాటలోనే…!

ఇక్కడ కథనంలోకి వెళ్లేముందు గతం లోకి ఒక్కసారి వెళ్లి వద్దాం…! గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ 21 న రాష్ట్ర టీడీపీలోని కాపు నాయకులూ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ పెద్ద డిస్కషన్ జరిగింది. అది ఏంటి అనేది బయటకు తెలియదు…(సందర్భానుసారం అక్కడి డిస్కషన్ చెప్పుకుందాం). ఆ తర్వాతనే కాపు నాయకుడు తోట త్రిమూర్తులు వైసిపిలో చేరారు. ఆ సమావేశానికి హాజరైన కదిరి బాబురావు కూడా తాజాగా చేరారు. ఇంకా కొందరు కీలక నాయకులు కూడా తోట, కదిరి బాటలోనే ఉన్నారు. ఇప్పుడు చాల నాయకుల్లో చర్చకు వస్తున్నా అంశం ఏమిటంటే అక్కడ ఏం జరిగింది? టిడిపి నుండి ఇంకా ఎవరెవరు వైసిపిలో చేరనున్నారు? తోట అంటే ఒకే, చేరిపోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ కదిరి బాబురావు. టిడిపికి అత్యంత సన్నిహితుడు. కారణాలు మనం కింద చెప్పుకున్నట్టు ఉన్నా, లోపల మాత్రం ఒక సామజిక అంశం పెద్దగా పనిచేస్తుంది అని అనుకోవచ్చు. కరోనా గోల తర్వాత ఏపీలో ఇంకా మార్పులు తప్పకపోవచ్చు అనే చర్చ జరుగుతుంది.

బాలయ్యకి స్నేహితుడు…!

ఒక నాయకుడు పార్టీ మారాడు అంటే… ఒకటి స్థానిక కార్యకర్తల అభిప్రాయాలు, రెండు ఎదుటి పార్టీ నాయకుడిపై నమ్మకం… మూడు ఉన్న పార్టీకి భవిష్యత్తు లేదనే భయం… ఈ మూడు ప్రధాన భూమిక పోషిస్తాయి. కానీ ఇటీవల జరిగిన ఓ మార్పు వెనుక చాలా కారణాలున్నాయి. చంద్రబాబు చేసిన మోసం.., ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన లాబీయింగ్ ఫలితంగా టిడిపి ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలయ్య ప్రాణ స్నేహితుడు కూడా టిడిపిని వీడాడు. అంతటి పరిస్థితులు కల్పించారు. జరిగిన విషయాన్నీ లోతుగా తెలుసుకుంటే…!

సీటు పేరిట ఒక డ్రామా…!

2019 ఎన్నికల్లో టీడీపీలో కనిగిరి, దర్శి సీటు ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఉగ్ర అప్పటికి ఆకస్మికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరుతూనే తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు అని ప్రకటించారు. కానీ సీటు కేటాయింపులో తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. ఇటు కదిరి బాబురావు తరపున నందమూరి బాలకృష్ణ, అటు ఉగ్ర నరసింహారెడ్డి తరపున ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇద్దరూ లాబీయింగులు నడిపారు. చివరికి రాధాకృష్ణ ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఉగ్రకి కనిగిరి సీటు కేటాయించారు. దర్శికి కదిరి బాబూరావుని ఒప్పించారు. కాని కదిరి బాబురావు మొండి చేసారు. కనిగిరిలో అయితే గెలుస్తానని చెప్పుకున్నారు. కానీ ప్రయోజనం లేదు. పార్టీ ఒత్తిళ్ళతో, ఆర్ధిక సహకారం హామీతో దర్శి నుండి పోటీకి ఒప్పుకున్నారు.

రెండో దెబ్బ ఆర్ధికంగా…!

జిల్లాలో… ఒక రకంగా రాష్ట్రంలోనే దర్శి అత్యంత ఖరీదైన నియోజకవర్గం. అక్కడ అలా అలవాటు చేసేసారు. పోటీ చేయడం ఇష్టం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. అందుకే ఖర్చుకి మనసు ఒప్పుకోవడం లేదు. పార్టీ హామీ ప్రకారం, మరోవైపు శిద్ధా హామీ ప్రకారం తనకి త్వరగా ఏర్పాటు చేయాల్సిందే అంటూ రోజు రాత్రిళ్ళు రాయబారాలు నడిపారు. కానీ పార్టీ కూడా చేతులెత్తేసింది, తర్వాత పంపిస్తాం మీరు లోకల్ లో చూసుకోండి అంటూ కబురు పంపింది. శిద్ధా కూడా అనుకున్నంతగా సర్దుబాటు చేయలేదు. ఎలాగోలా తనే చూసుకుని ఖర్చు చేసారు. అలా ఆర్ధికంగా బాబురావు అనుకున్నట్టు జరగలేదు. దీంతో తానూ మోసపోయానని లోలోపల బాధపడ్డారు. పార్టీపై కోపం పెంచుకున్నారు.

మూడో కారణం ఇంచార్జి గొడవ…!

ఇక అంతా ముగిసింది ఎన్నికల్లో టీడీపీ దెబ్బతిన్నది. ఓకే..! ఇక్కడితో అయిపోతే చెప్పుకునే అవసరమే లేదు. కానీ ఇక మొదలయ్యింది అసలు విషయం. నియోజకవర్గాలకు ఇంచార్జిలు ఉంటారుగా. దర్శి లో నేను ఓడిపోయాను.., నాకు కనిగిరి ఇచ్చేయండి అక్కడే ఉంటాను అంటూ కదిరి మళ్ళీ పట్టు పట్టారు. ఉగ్ర ఘోరంగా ఓడిపోయారు, నేను స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని గెలిపించుకుంటాను కనిగిరి ఇచ్చేయండి అంటూ మళ్ళీ చంద్రబాబు చుట్టూ తిరిగారు. ఏం లాభం లేదు. ఒప్పుకోలేదు. మళ్ళీ కదిరి చిన్నబోయారు. అందుకే సరైన సమయం చూసుకుని వైసీపీలోకి జంపయ్యారు.

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment