NewsOrbit
రాజ‌కీయాలు

నేతలు నేటి వాక్కులు


ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…..

హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది.
ముందస్తు హెచ్చరికలు జారీ వ్యవస్థ ఎర్లీ వార్ణింగ్ డిస్మినేషన్ సిస్టమ్ ఆంద్రప్రదేశ్ కి తీర ప్రాంతానికి ఒక వరం. ఇది ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కి చాలా ఉపయోగంగా ఉంటుంది. ముందుగా ఏదైనా విపత్తు సంభవించే ప్రమాదం ఉన్నపుడు ప్రజలు, ఆస్తి నష్టం కాకుండా దోహదపడుతుంది.
భారతదేశంలో 2వ రాష్ట్రంగా విపత్తు ముందుగా తెలుసుకునే రాష్ట్రం మన ఆంద్రప్రదేశ్. తుఫానులు, వరదలు, భూకంపం, ఉప్పెనలు, సునామిలు, భారీ అగ్నిప్రమాదాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు నష్టాల తీవ్రతలను తగ్గించేందుకు ఈ ముందస్తు హెచ్చరికలు చాలా ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది.
చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నీచ సంస్కృతి మానుకుంటే మంచిది. మద్యపానం తగ్గించేలా చేయాల్సిన చంద్రబాబు దానిని తాగించేలా దిగజారి మాట్లాడుతున్నారు. మద్యపానం నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. చంద్రబాబు ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది.
చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉంటూ నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోతున్నాయంటే బాధపడాలి. చంద్రబాబు లాంటి శాడిస్ట్ పరిశ్రమ పోతుందంటే ఆనందపడుతున్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ లోని పేదలకు రాజధాని లో సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఎస్సీల స్ధలాలు లాక్కుంటున్నామని చంద్రబాబు అవాకులు చవాకులు పేలుతున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు ప్రోత్సహించకపోయినా పర్లేదు కాని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వంలొ పేదలకు ఇళ్ళు ఇస్తే విమర్శలు చేస్తారా. ఇళ్ల కోసం గత ప్రభుత్వానికి డబ్బులు కట్టిన వారికి మేం అన్యాయం చేయం. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చి తీరుతాం.

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వైఎస్ హయాంలో జక్కంపూడి లో 17 వేలు ఇల్లు ఇస్తే జగన్ సిఎం అయ్యాక విజయవాడలో 80 వేల మందికి ఇల్లు ఇవ్వడం శుభపరిణామం. టిడిపి నేతలు విమర్శలు చేస్తే సహించం. పేదలకు ఇళ్ళు ఇస్తున్న ఘనత జగన్ దే. ఓట్ల కోసమే గత ప్రభుత్వం ఇళ్ళు పేరుతో నాటకాలాడి దోచుకుంది. అర్హులైన ప్రతిఒక్కరికి ఇల్లు ఇవ్వడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం.

టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ.

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఎందుకు లేదన్న చర్చ రెండు రోజులుగా జరుగుతోంది. మన సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ముఖ్య మంత్రులకు విందుకు పిలిచారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్ర, క్రిమినల్ కేసులు, నియంత వ్యవహారం ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది కాబట్టి ఈ రోజు పిలుపు రాలేదు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

Leave a Comment