NewsOrbit
రాజ‌కీయాలు

”నాయకుల నేటి వాక్కులు”

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….

వైసీపీ ఎంఎల్ఏ గుడివాడ అమరనాధ్

2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటి డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకటనతో స్పష్టమవుతుంటే చంద్రబాబు, ఎల్లోమీడియాకు ఇది కనిపించడం లేదా. బోగస్ కంపెనీలతో వేల కోట్లు దారిమళ్లించారు. యనమలకు పంటినొప్పితో పాటు కంటిచూపు కూడా పోయింది. యనమలకు కంటి వైద్యం చేయించాలని సిఎం వైయస్ జగన్ ను కోరతా. దమ్ము ధైర్యం ఉంటే ఐటి అధికారులపై డిఫర్మేషన్ వేయండి. చంద్రబాబు హయాంలో కాపులకు సంబందించిన బిసిల అంశం వచ్చినప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి సబ్జెక్ట్ డైవర్ట్ చేశారు. పోలవరం వద్ద పాటలు పెట్టారు. జయం జయం చందన్న అని ఇప్పుడు అలా కాదు. జైలు జైలు చంద్రన్న అని పాడుకోవాల్సి ఉంటుంది. మీ బినామిలైన నారాయణ, ప్రతిపాటి పుల్లారావు. యరపతినేని, దేవినేని, గల్లాజయదేవ్ లాంటి వ్యక్తులందరూ కూడా వారందరికి ఎక్కడ పీకకు చుట్టుకుంటుంది, బినామి ఆస్దులు బయటపడిపోతాయి. ఇది గోరంత ఇంకా కొండంత అవినీతిచేశారు. అదంతా బయటపడి పోతుందనే భయంతో చలి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నారు. మీరు ఇంకా నీతి నిజాయితి 40 సంవత్సరాల ఇండస్ర్టీ అంటూ మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది. అచ్చెన్నాయుడుకి చంద్రబాబుపై కోపం ఉన్నట్లు ఉంది. చంద్రబాబుగారితో తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ చేశారు. ఈ వయస్సులో చంద్రబాబు కొండఎక్కితే ఏమవుతుందో తెలిసే ఇలా సవాల్ చేశారంటే ఏమనాలి.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి

ఎన్నికల కు ముందు కేంద్రం మెడలు వంచి విభజన హామీలు రాబడతామని చెప్పి ఇప్పుడు కేంద్రం ముందు వైసీపీ మోకరిల్లడం సిగ్గు చేటు. బీజేపీతో పొత్తు కోసం సిఎం జగన్ తహతహలాడుతున్నారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాజీనామా చేయడానికైనా సిద్ధమన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు. సిఎఎపై అవగాహన లేక ఓటేశామని వైసిపి నాయకులు అనడం సిగ్గు చేలు. అవగాహన లేనప్పుదు పదవులు ఎందుకు రాజీనామా చేయాలి.

వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ 

దేవినేని ఉమ భాష నేర్చుకోవాలి. హద్దుమీరి మాట్లాడుతున్నారు. సభ్యతా సంస్కారం లేని మాటలు ఇకనైనా ఆపాలి. అంబోతుగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. లోకేష్ కు అసలు లోకజ్ఞానం లేదు. రేపో మాపో లోకేష్ ఉద్యోగం ఊడిపోతుంది. ఏబిసిడిలు రాని టిడిపి నేతలు ట్వీట్లు చేస్తున్నారు. శ్రీనివాస్ తో సంబంధం లేదన్న వ్యక్తులు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ ఆ డబ్బు ఎక్కడకు పంపించాడో వాస్తవాలు బయటకు వస్తాయి. తప్పులు మీ దగ్గర పెట్టుకుని సాక్షి మీడియా పై బురద చల్లుతారా.

టీడీఎల్పీ ఉపనేత, అచ్చెన్నాయుడు

ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి గారడీ మాటలతో పబ్బం గడుపుకునేలా వైకాపా తొమ్మిది నెలల పాలన సాగింది. బలహీనవర్గాలు ఎప్పుడూ తేదాపాకు అండగా ఉంటారనే వారిని అణిచివేసే కుట్ర చేస్తున్నారు. బలహీనవర్గాల నిధులు దారిమళ్లిస్తున్నారని ప్రశ్నించటమే విజయ్ కుమార్ చేసిన తప్పా?. పోస్టు పెట్టినందుకు ముఖానికి ముసుగువేసి తీవ్రవాదిలా చిత్రీకరిస్తారా?.  బీసీల నిధులు అమ్మవడికి మళ్లించి బలహీన వర్గాల పొట్టకొడుతున్నారు.

ఎమ్మెల్సీ జగదీశ్‌ 

మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామోదం లేదు. రాజధాని అంటే విశాఖ ప్రజలు భయపడుతున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే వైసీపీ లక్ష్యం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారు.

టీడీపి ఎమ్మెల్సీ, నారా లోకేష్

మీ నాన్న ఎవరు అని తెలుగులో అడుగుతాం. హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్ లో అడుగుతాం. వైకాపా భాషలో నీ అమ్మ మొగుడు ఎవరు అని అడుగుతారు. సోషల్ మీడియాలో వైకాపా భాష అవసరం లేదు. తుగ్లక్ పాలన గురించి ప్రజలకు అర్ధం అయ్యేలా మాట్లాడండి. దేశాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చు అని అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే దేశానికే ప్రమాదం. అలాంటి కోరికలు నాకు లేవు. చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్ గారు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బాబు గారి హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకున్నారు.

ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాం. రాష్ట్రమంతా వివిధ దశల్లో జరిగే ఎన్నికల్లో పోటీకి బిజెపి శ్రేణులను సిద్ధం చేస్తున్నాం. బిజెపి, జనసేన కలిసి ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది త్వరలోనే ప్రకటన చేస్తాం. టిడిపి,వైసిపికి సమదూరంలో బిజెపి ఉంటుంది. అదే మా స్టాంఢ్. ప్రజలను మోసం చేయడానికే‌ జగన్ మూడు రాజదానులు నిర్ణయం.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వర్ల రామయ్య 

ఫోర్త్‌ ఎస్టేట్ గా సమాజంలో విలువైన స్థానంలో ఉండావాల్సిన సాక్షి పత్రిక ఒక రాజకీయ పార్టీకి కరపత్రికగా ఉపయోగపడటం దురదృష్టకరం. మాజీ పీఎస్‌ శ్రీనివాసరావుపై ఐటీ సోదాలకు సంబంధించి.. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్తంగా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, రూ.2వేల కోట్లు సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. కానీ.. ఆ సొమ్ము మొత్తం కూడా పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లోనే స్వాధీనం చేసుకున్నట్లు, ఆ బురదను చంద్రబాబు నాయుడు గారికి అంటగ్టాలని అనుకోవడం ఎంత వరకు సమంజసం.?ఇది అబద్దపు వార్తలను ప్రచురించడం కాదా.? ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మరో రాజకీయ పార్టీపై బురద జల్లడం భావ్యమా.? నిన్న ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రూ.2.63 లక్షల నగదు, కుమార్తెకు చెందిన కొన్ని బంగారు ఆభరణాలు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఉన్నట్లు, వాటి రికార్డులు సక్రమంగా ఉండడంతో తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను అన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేశారు. కానీ సాక్షి పత్రికలో గానీ, ఛానల్‌లో గానీ కనీసం ఒక్క నిమిషం కూడా ప్రసారం చేయలేదు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Leave a Comment