NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ప్రకాశంలో రాజకీయం సర్దుకున్నట్టేనా…!

రెండు రోజుల కిందటి వరకు ప్రకాశం జిల్లాలో ఒకటే చర్చ..! ఒకటే రచ్చ…! చీరాల వైసీపీ ఇంచార్జి ఎవరు…? పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారా లేదా…?? గొట్టిపాటి రవికుమార్ పరిస్థితి ఏంటి.. ?? అంటూ ఒకటే చర్చ. ఇప్పుడు వీటికి నెమ్మదిగా స్పష్టత వస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో విషయాలన్నీ నెమ్మదిగా సర్దుకుంటున్నాయి.

చీరాల ఇక ఆమంచి చేతిలో…!

జిల్లాలో అతి ముఖ్యమైన టాపిక్ ఇదే. చీరాల రాజకీయ మార్పులు ఏంటి..? ఇంచార్జి మారతారా? అని!! దీనికి రెండు రోజుల కిందట వైసీపీ మార్కు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఇన్చార్జిగా ఉన్న ఆమంచి పగ్గాలు మార్చే అవకాశమే లేదని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కరణం బలరాం… కేవలం ఎమ్మెల్యే అనే పేరుకే ఆయన అక్కడ ఉంటారని వైసీపీ వర్గాలు ఆమంచికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు నుండి పార్టీలో చేరి పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ఆమంచికి కాకుండా.., వ్యక్తీగత అవసరాలకు పార్టీలోకి వచ్చిన కరణం కి ప్రాధాన్యత ఇస్తే పార్టీ శ్రేణులకు అది చెడు సంకేతంగా వెళ్తాదని అంతర్గతంగా చర్చలు జరగడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు మొన్న తనను కలిసిన ఆమంచికి జగన్ స్పష్టత ఇచ్చారు, పార్టీ నాయకుడు సజ్జల కూడా ఆమంచితో చాలా సమయం మాట్లాడి స్పష్టత ఇచ్చారు. ఇక బదిలీలు కూడా ఆగినట్టే. కాకపోతే కరణంతో పాటూ పార్టీలోకి వచ్చిన నాయకులు చేస్తున్న అతిని కూడా పార్టీ పరిశీలించాలని ఈ నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.

ఏలూరి ప్రస్తుతం లేనట్టే…!

ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ మార్పు వ్యవహారం. ఇది కూడా వారం రోజుల నుండి బాగా నోళ్ళల్లో నలుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆగినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ నుండి సానుకూలత లేదు అని మొదటి నుండీ చెప్పుకుంటున్నాం. జిల్లాలో మంత్రి బాలినేని , ఇతర సీనియర్ నాయకులు ఎమ్మెల్యే చేరిక విషయంలో కొంత కీలకంగా వ్యవహరించినప్పటికీ… సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్యేల చేరికపై అంతగా ఆసక్తి చూపలేదని తెలిసింది. అయితే ఎమ్మెల్యే తరపున వచ్చిన ప్రతిపాదనలు, కొన్ని ఆకాంక్షల విషయంలో వైసీపీ నుండి స్పష్టత లేకపోవడంతో ఆగింది అని సమాచారం. సో… కారణాలు ఏమైనప్పటికీ ఈ విషయం కూడా బ్రేకులు పడింది. మరోవైపు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఇప్పట్లో పార్టీ మరే అవకాశం లేదని అంటున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వ్యక్తిగతంగా భరోసా ఇవ్వడం…, ఇటు వైసీపీ నుండి కూడా అంత సానుకూలత లేకపోవడంతో ఆగినట్టేనని జిల్లాలో చర్చ జరుగుతుంది.

author avatar
Srinivas Manem

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju