Prasanth Kishore: చెప్పింది చేసి చూపించిన ‘పీకే’..! ఇక ఆయన టార్గెట్ ‘ఢిల్లీ’ పైనేనా?

prasanth kishore next target fix
Share

Prasanth Kishore: ప్రశాంత్ కిషోర్ Prasanth Kishore.. రాజకీయ నాయకుడు కాకపోయినా రాజకీయాల్ని వడపోసే సత్తా ఉన్న విశ్లేషకుడు. అందుకే.. ప్రస్తుతం ఈ పేరు దేశంలో మోగిపోతోంది. సైలెంట్ గా పని చేస్తూనే.. ఫలితాన్ని బ్లాస్ట్ చేయడం ఆయన నైజం. ప్రాంతీయ పార్టీలకు సైతం అంతుబట్టని స్థానిక బలాన్ని అంచనా వేయడంలో పీకే దిట్ట. 2014లో మోదీ దేశ ప్రధానిగా, తర్వాత 2019లో ఏపీ సీఎంగా జగన్, 2019లో ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ గెలవడంలో పేకే పోషించిన పాత్ర చాలా ఎక్కువ. ఇప్పుడు అదే పీకే.. అటు బెంగాల్లో మమతా బెనర్జీని మళ్లీ సీఎంగా.. ఇటు తమిళనాడులో కొత్త సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్ ను కూర్చోబెట్టడంలోనూ కీలకపాత్ర పోషించారు.

prasanth kishore next target fix
prasanth kishore next target fix

తానేంటో.. తానేం చేయగలనో పీకేకు స్పష్టంగా తెలిసు. చేసేది చెప్పరు. చేసి చూపిస్తారు. బీజేపీతో ఉన్న వైరం కారణంగా 2020 డిసెంబర్ 21న ఓ ట్వీట్ చేశారు. ‘కొందరు కలగంటున్నారేమో.. బెంగాల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావు.. ఇదే జరిగితే నేను ట్విట్టర్ నుంచి వైదొలగుతాను’ అని. ఇప్పుడు ఆయన మాటే నిజమైంది. బెంగాల్లో దీదీ తిరుగులేని విజయం సాధించారు. ఇటు తమిళనాడులో కూడా డీఎంకే విజయం సాధించింది. స్టాలిన్ సీఎం కాబోతున్నారు. ఇలా ఒకరు ప్రధాని, నలుగురు ముఖ్యమంత్రులు కావడంలో ‘పీకే’ కీలకపాత్ర పోషించారు. దీంతో తాను చేసింది కొంత.. చేయాల్సింది కొండంత ఉందని కూడా తెలుసుకున్నారు. ఇకపై తన ప్రయాణం వేరని ప్రకటించారు.

గతంలోనే పీకే రాజకీయాల్లోకి వెళ్తారని భావించి బీహార్లో నితీశ్ కుమార్ తో జత కలిశారు. కానీ.. బీజేపీతో వచ్చిన డిఫరెన్సెస్ తో ఆయన అక్కడి నుంచి వచ్చేశారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో భాగస్వామి అయ్యారు. ఆ ప్రక్రియ ముగిసింది. ‘ఇక నా గమ్యం వేరు..’ అని ప్రకటించి తన లక్ష్యం వేరని చెప్పకనే చెప్పేశారు. సొంతంగా పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంలోని మోదీ, షా ద్వయాన్ని ఢీ కొట్టి బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడమే ఆయన ముందున్న లక్ష్యంగా తెలుస్తోంది. ఆమధ్య దీదీ కూడా.. ‘బెంగాల్లో గెలిచిన తర్వాత తన గురి ఢిల్లీపైనే..’ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీకే తదుపరి అడుగులు ఎలానో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!

 


Share

Related posts

బ్రేకింగ్ – ఫోటో న్యూస్ : ఏపీ లో ఇంటికే క్వారంటైన్ కిట్ ఇదిగో చూడండి

arun kanna

India Politics : భారతదేశంలో రాజకీయం ఎంతో కాస్ట్లీ! ఇదిగో చుడండి!

Comrade CHE

ఇండియా – చైనా వివాదం గల్వాన్ గురించి తెలుసుకోండి…!!

Srinivas Manem