NewsOrbit
రాజ‌కీయాలు

మోదీలో భ‌యం… ఇదిగో ఇదే నిద‌ర్శ‌నం!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ శ్రేణులు ఊహించని కామెంట్ ఇది. కీల‌క సంద‌ర్భంలో మోదీ వైఖ‌రి కార‌ణంగా ఆయ‌న్ను విప‌క్షం టార్గెట్ చేసింది.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని వెూదీ ప్రసంగించిన సంగ‌తి తెలిసిందే. భారత సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసే వారికి ఎల్‌ఓసీ మొదలు ఎల్‌ఏసీ వరకూ సైన్యం దీటైన జవాబిచ్చిందని ప్రధాని వెూదీ ప్ర‌క‌టించారు. అయితే, వెంట‌నే ప్రధానిపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ప్రధాని వెూడీపై పరోక్షంగా విమర్శల దాడి చేశారు. అధికారంలో ఉన్న వారు చైనా పేరెత్తడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. చైనా పేరు ఎత్తడానికి అధికార పక్షం భయపడుతోందని కాంగ్రెస్ నేత‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు 130 కోట్ల మంది భారతీయులకు మన సైన్యంపై పూర్తి విశ్వాసముంది. చైనాకు దీటైన జవాబిచ్చిన సైన్యానికి మేము సెల్యూట్‌ చేస్తున్నాం. కానీ అధికార పక్షంలో ఉన్న వారి సంగతేంటి చైనా పేరెత్తడానికే వారెందుకు జంతుకుతున్నారని సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌సంగంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి లేదా వాస్తవాధీన రేఖ వెంబడి మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన వారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారని తెలిపారు. ఉగ్రవాదం, విస్తరణవాదానికి సహాయపడే శక్తులను, వాటిని బలపరిచే శక్తులను ఓడించడానికి భారత్‌ సదా సిద్ధంగానే ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను కోరుకుంటున్నామని వెూదీ స్పష్టం చేశారు.

పరస్పర విశ్వాసం, గౌరవంతోనే సంబంధాలు ఉండాలని కోరుకుంటుందని చెప్పారు. భూమి, సముద్రం సరిహద్దులు కలిగిన అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. పొరుగు దేశాలతో కలిసి పని చేసేందుకు స్నేహ హస్తం అందిస్తున్నామన్నారు. దక్షిణాసియాలోని ప్రతి దేశంతో భారత్‌ కలిసి పని చేయాలని కోరుకుంటుందని, వేలాది సంవత్సరాలుగా సంవత్సరాలుగా సముద్ర తీర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉందని వెూదీ గుర్తు చేశారు. అలాగే తూర్పు ఆసియా దేశాలతోనూ భారత్‌ స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకుందన్నారు. లడఖ్‌లో చైనా అతిక్రమణతో పాటు మన దేశ సైనిలిచ్చిన జవాబును ప్రపంచం మొత్తం చూసిందని వెూదీ పేర్కొన్నారు.

author avatar
sridhar

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju