NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష

Breaking:  మునుగోడు ఉప ఎన్నిక ను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభ్యర్ధులు, ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా స్రవంతి రెడ్డి, బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులతో కలిసి 40 మంది పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ మూడు పార్టీల మధ్యనే నెలకొంది. అయితే టీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నదని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో జససమితి నేత, ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి దిగడం హాట్ టాపిక్ అయ్యింది.

Kodandaram

జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్ లోని ఎన్నికల కార్యాలయంలో మౌన దీక్ష చేపట్టారు. బుద్దభవన్ లోని ఎన్నికల ప్రధాన అధికారి (సీఇఓ) కార్యాలయం వద్ద ఆయన నిరసనకు దిగారు. మునగోడు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని కోదండ రామ్ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక రద్దు కొరకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఈ సి నిబంధనలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. మంత్రులు అధికారిక హోదాలో హామీలు ఇస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. అధికార దుర్వినియోగం కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారికంగా మద్యం పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారానికి వస్తే హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారని అన్నారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పోతున్నదని అన్నారు.

Anand Mahindra: రిషి సునాక్ ఎన్నికపై సోషల్ మీడియాలో వైరల్ అయిన అనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju