ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్ట్‌… ల‌వ్ యు జ‌గ‌న్‌

వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. ఓవైపు ఆయ‌న‌పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల విష‌యంలో సీబీఐ కేసులు, సోదాలు జరిగినా ఆయ‌న మాత్రం సీఎం జ‌గ‌న్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు కొన‌సాగిస్తున్నారు. raghurama krishna raju troubling cm jagan

తాజాగా ఆయ‌న మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆవేద‌న వ్య‌క్లం చేశారు. త‌న‌ను అరెస్ట్‌ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ల‌వ్ యూ జ‌గ‌న్‌

రాష్ట్ర అభివృద్ధి గాలికి వ‌దిలేసి ఇత‌ర ప‌నుల్లో పాల‌కులు పబ్బం గడుపుతున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. న్యాయానికే సంకెళ్లు వేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. తన సెక్యూరిటీని క్యాన్సిల్‌ చేయించడానికి కొందరు వైసీపీ పెద్దలు కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు. ఆ చెద పురుగుల పీడ త్వరలోనే వదులుతుందన్నారు. రాజధాని భూముల్లో “ఇన్ సైడర్ ట్రేడింగ్” జరగలేదన్న ముఖ్యమంత్రి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రిని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు….పార్టీ హితం కోరే చెప్తున్నానాన్న ఆయన తాను ముఖ్యమంత్రిని ప్రేమిస్తున్నానని అన్నారు. సలహాదారులు ముఖ్యమంత్రికి పనికిమాలిన సలహాలు ఇవ్వడం మనేయాలని ఆయన కోరారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేసి ప్రజలపై రుద్ద వ‌ద్దని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు.

కిరాత‌కంగా చంపేసిన త‌ర్వాత…

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్నను కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు ఆ కేసు దర్యాప్తు పూర్తి చేయలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు ఇంకా బయటకు రాలేదన్న ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసును సెక్షన్ 174 కింద నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మానసిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ట‌

గ‌తంలో సైతం ర‌ఘురామ కృష్ణంరాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మానసిక రుగ్మతితో ఈ మధ్యన ప్రభుత్వాలను నడిపిస్తున్న వారు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.. దీనికి సంబంధించిన మందులు కొంతమంది వాడుతున్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. సీఎం అనుమతిస్తే వారి సమాచారం ఇస్తా.. అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అర్హత లేదని రాజ్యాంగం ప్రకారం వారు పదవులలో కొనసాగడానికి వీలులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.