RRR: ఆ విషయంలో.. రఘురామ పాటి తెగువ బాబుకు లేకపాయెనే..!!

Share

RRR: ‘కందకు లేని దురద.. కత్తిపీటకు ఎందుకు’ అని ఓ సామెత. కానీ.. ఇక్కడ కత్తిపీట పదును మరింత పదునెక్కుతోంది. విషయంలోకి వస్తే.. వైసీపీ రెబల్ రఘురామకృష్ణ రాజు తన ఎంపీ పదవికి రాజీనామా (క్లారిటీ లేదు) చేస్తానని ప్రకటించారు. అది కూడా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా.. అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలనే అంశానికి మద్దతుగా. దాదాపు రెండేళ్లుగా రఘురామ సొంత పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ షోకాజ్ నోటీస్, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ పార్లమెంట్ స్పీకర్ కు లేఖ ఇచ్చినా, ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ ఆయన్నేమీ చేయలేకపోయింది. కానీ.. ఆయనే స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

raghurama daring step rather than chandrababu

చంద్రబాబు చేసింది ఇంతేనా..

మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రస్తుతం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.  అమరావతే రాజధానిగా ఉంచాలని టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు వాదిస్తున్నాయి. అమరావతి ప్రాంత రైతులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. అయితే.. అమరావతి కోసం (RRR) రఘురామ రాజధాని చేస్తానని.. అదే నినాదంతో ఉప ఎన్నికకు వెళ్తానని అన్నారు. ఇది చాలా తెగువతో కూడుకున్న నిర్ణయమే. కానీ.. ఇదే తెగువ తన హయాంలో రాజధానిగా ప్రకటించి, భూసేకరణ చేసి మొదలుపెట్టిన చంద్రబాబు మాత్రం వైసిపీకి సవాల్ విసరడమే తప్ప చేసిందేమీ లేదని చెప్పాలి. అమరావతి రిఫరండమ్ గా ఎన్నికలకు వెళ్దాం.. రాజీనామాలు చేయండి అని జగన్ కు సవాల్ విసురుతున్నారు.

చంద్రబాబు సమాధానం ఏంటి..

టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళ్దాం.. తేల్చుకుందామని వైసీపీ ప్రతి సవాల్ విసిరితే సమాధానం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి, వీళ్లంతా గెలుస్తారో లేదో.. ఎందుకొచ్చిందిలే అని చంద్రబాబు వెనకడుగు వేసుండొచ్చు. కానీ.. (RRR) రఘురామ తెగువ చూస్తే.. అసలు రాజీనామా చేసి అమరావతి కోసం పోరాడాల్సింది ఎవరు.. పోరాడుతోంది ఎవరనే అనుమానం రాకపోదు. రాజధాని అంశంతో సంబంధం లేని రఘురామ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే.. మరి చంద్రబాబును చూసి ప్రజలు ఏమనుకోవాలి. అమరావతిపై రఘురామ తెగువను చూసి టీడీపీ విశ్వసనీయతపై ప్రశ్నలు వేస్తే చంద్రబాబే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందేమో..!


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

41 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago