NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP RRR: మాట తప్పి, మడమ తిప్పిన జగన్… రఘురామ లేఖాస్త్రంలో ముదిరిన వ్యాఖ్యలు..!!

raghuramakrishna raju letter to cm jagan

MP RRR: ఎంపీ రఘురామకృష్ణ రాజు MP RRR వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఎంపీ నుంచే చికాకులు, తలనొప్పులు ఎదురవుతాయని ఊహించి ఉండరు. దేశంలో మరే ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన వ్యక్తి ఇలా.. పక్కలో బల్లెంలా మారతారని ఆయన ఊహించి ఉండరు. ఆయన పార్టీకి దూరం అయ్యారో.. పార్టీనే ఆయన్ను దూరం చేసుకుందో అనే విషయాలు పక్కనపెడితే రఘురామకృష్ణ రాజు సీఎం జగన్ కు ప్రతి విషయంలో అడ్డొస్తున్నారు. మొన్నటి ఆయన అరెస్టు నుంచి రఘురామలో వేగం మరింత పెరిగింది. సుప్రీంకోర్టు మాట్లాడొద్దంటే.. మౌనంగా ఉంటూనే లేఖలు రాస్తున్నారు. రోజుకో లేఖ రాస్తున్న రఘురామ ఇప్పుడు సరికొత్త అంశంతో జగన్ కు లేఖ రాశారు.

raghuramakrishna raju letter to cm jagan
raghuramakrishna raju letter to cm jagan

శాసనమండలిని రద్దు చేయాలంటూ సరికొత్త విషయాన్ని ఎత్తుకున్నారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి  రఘురామ లేఖ రాశారు. గతంలో మండలిని రద్దు చేయాలని జగన్ తీర్మానం చేసిన అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే మీ చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని లేఖలో పేర్కొన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందని అన్నారు. మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రిగా మీరే గతంలో చెప్పారు. ఆ మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మండలిలో రాజధాని బిల్లు తీర్మానం విషయంలో జరిగిన అలజడి దృష్ట్యా 2020 జనవరిలో అసెంబ్లీలో మండలి సిఫారసు చేశారు సీఎం.

Read More: YSRCP: వైసిపీలో విజయసాయి సమస్య.. జగన్ చేయి దాటిపోతోందా..!?

రాజ్యాంగం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని.. ఏడాదికి 60కోట్లు మండలికి ఖర్చు దండగ అన్నారు. ఆర్టికల్‌ 169 ప్రకారం మండలి రద్దు అధికారం శాసనసభకు ఉందన్నారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. అసోం, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమకు మండళ్లు వద్దని కోరుతున్నాయని ఆనాడు జగన్ అన్నారు. కానీ.. ఆ నిర్ణయం మార్చి ఇప్పుడు మండళ్లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఖరారయ్యారు. దీంతో వైసీపీ బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ మండలిని రద్దు చేయాలని కోరుతున్నారు. రఘురామ లేఖను పట్టించుకుంటారో లేదో కానీ.. రఘురామ తన లేఖ ద్వారా ఈ విషయాన్ని హైలైట్ చేసినట్టైంది.

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!