NewsOrbit
రాజ‌కీయాలు

లేటుగా వచ్చినా.. లేటెస్ట్ బాంబ్ వేసిన రెబల్ ఎంపీ రాజుగారు..!!

raghuramakrishna raju letter to president of india

ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే ఉన్నారు. అయినా.. జగన్ ముందుకే వెళ్తున్నారు. సహజంగానే ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉంది. రాజధాని తరలింపు అంశాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి విచారిస్తున్నారు. ఓపక్క హైకోర్టు తీర్పులు ప్రభావితం అవుతున్నాయంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బహిరంగ లేఖ రాశారు జగన్. ఈ పిల్ కీలకదశలో ఉండగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సిక్కిం హైకోర్టుకు బదిలీ అయింది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ స్పందించిన తీరు ఇప్పు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

raghuramakrishna raju letter to president of india
raghuramakrishna raju letter to president of india

రాష్ట్రపతికి లేఖ..

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీని నిలుపుదల చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏకంగా రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. ఏపీ రాజధాని తరలింపు అంశం హైకోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ బదిలీ సరికాదని.. పునఃసమీక్షించి ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలంటూ లేఖలో కోరారు. నిజానికి.. రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ సబబే అని చెప్పాలి. ఈ అంశంపై జస్టిస్ మహేశ్వరి మొదటి నుంచీ ఫాలో అవుతూ అందరి వాదనలు కూలంకషంగా విని ఉన్నారు. దీనిపై వాదనలు విన్న ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ప్రజలకు మేలు చేసేదే అవుతుంది. ప్రజలు కూడా రాజధాని అంశం త్వరగా తేలాలని కోరుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చే కొత్త చీఫ్ జస్టిస్ ఈ అంశాన్ని మొదటి నుంచీ అధ్యయనం చేయాల్సిందే.

ప్రజల కోసమేనా.. లేక..!?

మళ్లీ.. రైతులు, ప్రతిపక్షాలు, ప్రభుత్వ వాదనలు వినాలి. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ ఉన్న జస్టిస్ మహేశ్వరి అయితేనే ఈ కేసు త్వరితగతిన తేలుతుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అభిప్రాయంగా చెప్పాలి. అయితే.. హైకోర్టు తీర్పులపై నమ్మకంగా లేని ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బదిలీ ముఖ్యం. ఓపక్క సొంత పార్టీతో పొసగని ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ వెనుక ‘రాజకీయ ప్రోత్బలం’ ఉందా అనే అనుమానాలూ లేకపోలేదు. ఇవన్నీ పక్కనపెడితే.. ప్రజల దృష్ట్యా ఈ అంశంపై త్వరగా ఓ శాస్వత పరిష్కారం లభిస్తే అందరికీ మంచిది. మరి రాష్ట్రపతి దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.

 

 

 

author avatar
Muraliak

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju