జాతీయం టాప్ స్టోరీస్ తెలంగాణ‌ రాజ‌కీయాలు

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

Share

Warangal, Telangana: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు రోజుల పర్యటన నేపథ్యంలో తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్ జిల్లా హనుమకొండ లో జరిగిన రైతు సంఘర్షణ సభలో టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒకే ఒక కుటుంబం బాగుపడింది అని.. పరోక్షంగా కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్కరి వల్లే తెలంగాణ ఏర్పడలేదని తేల్చి చెప్పారు.

Direct battle between Congress, TRS at Telangana elections: Rahul Gandhi in Warangal | India News – India TV

ఎంతోమంది త్యాగాలు చేయడం వల్ల తెలంగాణ అవతరించిందని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యను ఉన్నారని వారిని బాధ్యత ఎవరు వహిస్తారు..?.. వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి..? రైతు ఆత్మహత్యలకు కారణం ఎవరు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటువంటి బాధ్యత రైతు కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం చాలామంది పోరాటాలు చేశారు. రక్తాన్ని కన్నీళ్లను చిందించారు.

Warangal: Rahul Gandhi's Comments- BJP Is Controlling TRS

అటువంటి పోరాటం చేసే వారికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఇవ్వటం జరిగింది అని రాహుల్ తెలియజే. ముమ్మాటికీ తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఎవరు.. బాగుపడతారని తెలంగాణ ప్రకటించడం జరిగిందో… వాళ్లు బాగుపడలేదు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పట్లో భావించాం. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి ఒక రాజు లాగా నియంత మాదిరిగా పరిపాలిస్తున్నారు అని రాహుల్ గాంధీ ధ్వజమేత్తరు. రాష్ట్రానికి కేవలం పేరుకే ముఖ్యమంత్రి.. కానీ ఇక్కడ రాజరికం నడుస్తోంది అంటూ … రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతమాత్రమే కాదు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణ రైతులకు మెరుగైన జీవితాలు అందిస్తామని ఇది కాంగ్రెస్ చేస్తున్న గ్యారెంటీ అని రాహుల్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

ముఖానికి రంగు వేసుకునే కమల్ హాసన్ కు… రంగులు మార్చే రాజకీయం చూపించిన కమలం

siddhu

‘వెయ్యి శాతం గెలుపు ఖాయం’

somaraju sharma

ఈ మూఢ సంస్కృతికి మూలం ఏమిటి?

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar