రఫేల్ స్కామ్ విషయంలో గతవారం ప్రధాని మోదీని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్నూ ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్ కుంభకోణంపై తన ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు ఇవ్వలేని మోదీ ఆ పనిని ఒక మహిళకు అప్పగించారని రాహుల్ గత వారం వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలు మహిళలను కించపరచే విధంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. మహళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. దుబాయ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంటులో మోదీ స్వయంగా తన వాదన వినిపించి ఉండాల్సిందని అన్నారు. నిర్మలా సీతారామన్ స్థానంలో ఎవరన్నా పురుషుడు ఉన్నా తాను అదే మాట అని ఉండేవాడినని ఆయన పేర్కొన్నారు.
ఆ మాటల ద్వారా మగబుద్ధి (సెక్సిజమ్) చూపారన్న విమర్శలను ప్రస్తావించినపుడు, ‘మీ మగబుద్ధిని నాపై రుద్దకండి’ అని రాహుల్ అన్నారు. రాహుల్ తన వ్యాఖ్య ద్వారా మొదటి మహిళా రక్షణ మంత్రిని అవమానించారని మోదీ విమర్శించారు. బిజెపి మంత్రులు సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ కూడా విరుచుకు పడ్డారు. భారత రాజకీయాల్లో కొత్త దిగజారుడును రాహుల్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని వారు అన్నారు.
Rahul Gandhi's comments on Defence Minister Nirmala Sitaraman's reply to a debate on a subject relating to Ministry of Defence is a new low in the history of Indian politics.
— Sushma Swaraj (@SushmaSwaraj) January 9, 2019
ప్రధాని విమర్శకు కూడా రాహుల్ అలాంటి సమాధానమే ఇచ్చారు. ‘మన సంస్కృతిలో మహిళలను గౌరవించడం ముందు ఇంట్లో ప్రారంభం కావాలి. మగవాడిని అనిపించుకోండి. వణికిపోవద్దు. సమాధానం చెప్పండి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
With all due respect Modi Ji, in our culture respect for women begins at home.
Stop shaking. Be a man and answer my question: Did the Air Force and Defence Ministry object when you bypassed the original Rafale deal?
Yes? Or No? #RafaleScam
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2019