ప్రశ్నార్థకంగా మారిన రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ..??

రజినీకాంత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యంత ప్రజాదరణ కలిగిన హీరో. కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ కి ఎదురేలేదు. రజనీకాంత్ సినిమాలు ఒక సంవత్సరం మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రిలీజ్ అయి విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా జపాన్ లో కూడా రజినీకాంత్ కి మంచి క్రేజ్ ఉంది. ఇంత పాపులారిటీ కలిగిన రజనీకాంత్… రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఆయన అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు కొంతమంది ప్రముఖులు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు.

Ram, Periyar and Rajinikanth: Is the superstar becoming a Hindutva  hardliner? - The Weekఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం హఠాత్తుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పార్టీ స్థాపించి విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ విధంగా ప్రకటనలు చేసిన తర్వాత రజనీకాంత్ తన అభిమానులకు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా వచ్చే ఏడాది మే మాసంలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో… మరోపక్క రజనీకాంత్ సినిమాలు ఒప్పుకుంటూ ఉంటున్న నేపథ్యంలో రజనీకాంత్ ఫ్యాన్స్ కి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

 

ఇదే సమయంలో రజినీకాంత్ ఆరోగ్యం బాగోలేదని పోలేక సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ లేఖ పై రజనీకాంత్ అభిమానులలో ఆందోళన నెలకొంది. కాగా రజనీకాంత్ తాజాగా ఈ లేఖపై సోషల్ మీడియాలో స్పందించారు. ఆ లెటర్ తను రాసింది కాదని తేల్చారు. అందులో ఆరోగ్యం గురించి వచ్చిన సమాచారం నిజమే అని తేల్చారు. ఆ లేఖలో రజిని కిడ్నీ సమస్య ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో రజినీకాంత్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్లు ఉంది. దీంతో ఆ వార్త నిజమేనని రజినీకాంత్ చెప్పటంతో రజిని పొలిటికల్ ఎంట్రీ ఈ విషయంలో ఫ్యాన్స్ అభిమానులు డైలమాలో పడ్డారు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో యూటర్న్ తీసుకున్నారా అన్న సందేహంలో అభిమానులు ఉన్నారు.