KCR Biopic: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చాలావరకు ఇప్పుడు మసాలా కాంటాక్ట్ సినిమాలతో పాటు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల జీవితాల బయోపిక్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే “లక్ష్మీపార్వతి ఎన్టీఆర్”, ఇంకా “రక్త చరిత్ర”, “వంగవీటి” వంటి సినిమాలను ఆర్జివి తెరకెక్కించడం జరిగింది. కాగా త్వరలోనే టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా తీసే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాను దర్శకత్వం వహించిన “కొండ” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ సినిమా ఎప్పుడు తీస్తారో చెప్పలేనని స్పష్టం చేశారు. విజయవాడ రౌడీయిజం ఇంకా రాయలసీమ ఫ్యాక్షనిజం పై సినిమాలు చేయడం జరిగింది. తాను ఏ బయోపిక్ తీసిన ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా.. చూపించనని తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ గురించి పెద్దగా తెలియదు కొండా సురేఖ, మురళి గురించి.. తెలుసుకునే సినిమా తీశా. ఈ తరుణంలో మూవీ కి వచ్చే రెస్పాన్స్ బట్టి ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్ చేస్తా అని రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కచ్చితంగా ముందుగానే రాంగోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్ చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తోంది. కెసిఆర్ పొలిటికల్ కెరియర్ లో తెలంగాణ ఉద్యమం చాలా కీలకం, అయితే ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుండి స్టార్ట్ అయింది. ఇటువంటి మేజర్ పాయింట్స్ కలిగిన కెసిఆర్ ప్రయాణాన్ని ఏ విధంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తాడో చూడాలి.