NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ratna Prabha IAS : కర్ణాటకకు సీఎస్ – జగన్ కేసుల్లో ఒకరు..!? తిరుపతి బీజేపీ అభ్యర్థి ప్రత్యేకతలు ఎన్నో..!!

Ratna Prabha IAS : Many Specialties of BJP Candidate

Ratna Prabha IAS : తిరుపతి ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు టీడీపీ, వైసీపీ కంటే బీజేపీ అభ్యర్థి విషయంలోనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. టీడీపీ తరపున పనబాక లక్షమి అందరికీ తెలిసిన మొహమే. గత ఎన్నికల్లో పోటీ చేశారు. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి. కేవలం పార్టీ జెండా, జగన్ మాత్రమే ఆయనకు బలం. స్వతహాగా ఆయనకు బలం లేదు..! కానీ బీజేపీ అభ్యర్థి విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని ఒప్పించి, పోటీకి మద్దతు తీసుకుని.., ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారిని పట్టుకొచ్చారు. ఇంతకూ ఈ రత్నప్రభ ఎవరు..? ఆమె ఎందుకు పోటీకి దిగారు..? ఓడిపోతే బీజేపీ ఇవ్వనున్న గౌరవం ఎలా ఉండనుంది..!? అనేది పరిశీలించాల్సిన అంశాలే..!!

Ratna Prabha IAS : Many Specialties of BJP Candidate
Ratna Prabha IAS Many Specialties of BJP Candidate

Ratna Prabha IAS : ఉన్నత విద్యా కుటుంబం..!!

రత్నప్రభ సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర్లో. ఆమె చదువు, పెరగడం మొత్తం హైదరాబాద్ లోనే. తండ్రి చంద్రయ్య కూడా ఐఏఎస్ అధికారి. ఆమె భర్త విద్య సాగర్, సోదరుడు సాయి చంద్ర కూడా ఐఏఎస్ అధికారులే. ఏపీలో వివిధ హోదాల్లో పని చేశారు. 1981 బ్యాచ్ కి చెందిన రత్నప్రభ కూడా ఏపీలో పని చేసి, కర్ణాటకకు వెళ్లారు. అక్కడ 2017 లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని… 2018 లో పదవీ విరమణ చేశారు. అనంతరం బీజేపీలో చేరి, కర్ణాటక రాజకీయాల్లో మహిళా విభాగం తరపున బీజేపీకి కీలకంగా పని చేస్తున్నారు. మహిళా అభ్యుదయం, మహిళా సాధికారిత అంశాలపై ఎక్కువగా చర్చలు జరుపుతుంటారు. తెలుగు వ్యక్తి కావడం, బీజేపీకి అత్యంత నమ్మకమైన మహిళా నేతగా ఉండడంతో తిరుపతి సీటుకి అధిష్టానం ఆమెని ఎంపిక చేసింది.

Ratna Prabha IAS : Many Specialties of BJP Candidate
Ratna Prabha IAS Many Specialties of BJP Candidate

జగన్ కేసుల్లో కూడా ..! కానీ..!!

ఈమె ఏపీలో అనేక హోదాల్లో పని చేసారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు, దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కార్యదర్శి హోదాలో పలు శాఖల్లో విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే 2011 , 2012 సమయంలో జగన్ పై సీబీఐ కేసుల నమోదులో ఈమె పేరు కూడా ఓ చార్జిషీటులో చేర్చారు. 2014 లో ఈమె డిశ్చార్జి పిటిషన్ వేసి, క్లీన్ చీట్ తెచ్చుకున్నారు. అనంతరం కేంద్ర సర్వీసులకు, కర్ణాటకకు వెళ్లిపోయారు. రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరి, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.

గెలుపు కోసం ప్రణాళికలు.. లేకపోతే..!!

బీజేపీ ఏపీలో ఎక్కడైనా గెలవడం అంత సులువు కాదు. 2019 ఎన్నికల్లోనే ఆ పార్టీకి దిక్కు లేదు. ఇప్పుడు ఆ పార్టీ మరింత దిగజారింది. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో బీజేపీ విలన్ గా మారిపోయింది. అందుకే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి పరువు దక్కడం కూడా కష్టమే. కాకపోతే జనసేన, ఓ సామాజికవర్గం ఓట్లు కోసం నమ్మకం పెట్టుకుని.. ఉనికి కోసం పోరాడుతుంది. కొన్ని ప్రత్యేక ప్రణాళికలతో, హిందూ సెంటిమెంట్ తో బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఓడినా రత్నప్రభకి కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారట. ఆమెకి ఉన్న అపారమైన పాలన అనుభవం, ఉన్నతమైన విద్యా విలువలతో ఆమెకు ఏపీలో రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడానికి లేదా.. ఆమె కోరితే మరో రాష్ట్రానికి ఇంచార్జి ఇవ్వడానికి కూడా బీజేపీ పెద్దలు వెనుకాడరని అంటున్నారు. సో.. భవిష్యత్తు ఆశల దృష్ట్యా.. ఆమె ఈ ఎన్నికల్లో పోటీలోకి దిగారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది..!!

 

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?