NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Politics: రేవంత్ రెడ్డి బోనులోకి బీజేపీ.. టీఆరెస్..!?

revanth reddy key role in telangana politics

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు Telangana Politics ఈటల రాజేందర్ అంశంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇక కేసీఆర్ తో పోరాటానికి ఈటల సిద్ధమైనట్టే. అందుకే అడుగులు కూడా పడ్డాయి. ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. టీఆర్ఎస్ నుంచి గతంలోనే బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. అయితే.. వీరి వెనుక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఉన్నారనే మరో షాకింగ్ వార్త రౌండ్ అవుతోంది. వీరంతా కేసీఆర్ దెబ్బ తిన్నవారే. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రిమండలి నుంచి బర్తరఫ్ అయి ఈటల రాజేందర్.

revanth reddy key role in telangana politics
revanth reddy key role in telangana politics

వీరంతా ఇప్పుడు కేసీఆర్ తో ఫైట్ చేయబోతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2018 ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఈటల వంతు వచ్చింది. దీంతో ఈటల బీజేపీలో చేరుతున్నారు. ఇక్కడే గొప్ప రాజకీయం జరుగుతోందని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల.. కొన్నాళ్లుగా భవిష్యత్ ప్రణాళికపై చర్చలు సాగిస్తున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరూ బీజేపీలో చేరుతున్నారు. అయితే.. వీరిద్దరి చేరికకు వ్యూహం రచించింది రేవంత్ రెడ్డి అనే వార్త తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. కారణం.. కాంగ్రెస్ తో కేసీఆర్ ను ఢీ కొట్టలేమని తెలిసే ఇలా కొత్త వ్యూహం వేసారని తెలుస్తోంది. కాదు.. ఇది బీజేపీ వేస్తున్న స్కెచ్ అని కూడా ఒక వాదన ఉంది.

BJP Telangana: Serious plan behind the Politics

Read More:Target Etala Rajendar: నాయకులకు ఇన్నోవాలు, లక్షలు..! ఈటల కోటలో గేమ్ మొదలు పెట్టిన టీఆరెస్..!?

కేసీఆర్ ను గద్దె దించాలంటే బలమైన నేతలు, కేసీఆర్ వ్యతిరేకులతోనే సాధ్యమని తెలిసి వీరందరినీ బీజేపీ చేరదీస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈటల, కొండా.. బీజేపీలో చేరిన తర్వాత 2023 ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరి కేసీఆర్ ను ఎదుర్కొనే వ్యూహంలోనే ఇదంతా జరుగుతోందని అనుమానాలు వస్తున్నాయి. టీపీసీసీ పదవి రేవంత్ కు వచ్చినా ఆయన మాట వినేవారూ లేరు.. ఆయనకు దక్కుతుందని రేవంత్ కూ నమ్మకం లేదు. విడివిడిగా ఉన్న కాంగ్రెస్ తో కేసీఆర్ ఢీ కొట్టడం అసాధ్యమనే.. మెల్లగా బీజేపీలో చేరి అనుకున్నది సాధించే లక్ష్యంగా ఇలా.. ఈటల, కొండాను బీజేపీలోకి పంపిస్తున్నారని ఒక అనుమానం. దీంతో.. 2023 ఎన్నికలకు ఇప్పటినుంచే కాక మొదలైందని చెప్పాలి.

 

 

 

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?