కవితకు, కేసీఆర్ కి దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డికి మధ్య వైరం గురించి తెలిసిందే. అధికార పార్టీకి దడ పుట్టించాలని రేవంత్ పావులు కదుపుతూనే ఉంటారు. కేసీఆర్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూనే ఉంటారు. వీరిమధ్య వైరంతో కేసీఆర్ ను ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఏ పని తలపెట్టినా రేవంత్ తన పద్దతిలో ఎదుర్కుంటూనే ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్ తలచుకొన్న ఒక పనిని కూడా రేవంత్ ఢీ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వీరిద్దరి మధ్య పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

revanth reddy targets again cm kcr
revanth reddy targets again cm kcr

కేసీఆర్ ఆధిపత్యంపై దెబ్బకొట్టే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అక్కడ గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిలకు కాకుండా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయన కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో దిగుతున్నారు. దీంతో కేసీఆర్ ఇక్కడి ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించారు. ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందనే చెప్పాలి. మొత్తం 824 మంది ఓటర్లకు 570 మంది టీఆర్‌ఎస్‌కు.. కాంగ్రెస్‌ కు 152 మంది.. బీజేపీకి 78 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరితోపాటు మరో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్వతంత్రులుగా ఉన్నారు. ఈ లెక్కలను చూస్తే కవిత గెలుపు అత్యంత సులువు.

రేవంత్ చేస్తున్న ప్రయత్నాలు..

దుబ్బాకలో ఏప్రిల్‌ 7నే జరగాల్సిన పోలింగ్ లాక్ డౌన్ కారణంగా జరగలేదు. ప్రస్తుతం పరిస్థితులు కొంత అనుకూలించడంతో అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహిస్తోంది. రేవంత్ టీఆర్ఎస్ లోనే రాజకీయం పుట్టించాలని ప్లాన్ చేశారు. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలను కూడదీసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కేసీఆర్ ను కలవరపెడుతోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం ఆయనకు కాస్త ఊరటనిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కుమార్తె ఓటమి కేసీఆర్ ను కాస్త కుంగదీసింది. దీంతో కవితను మండలికి పంపించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.