రేవంత్ రెడ్డి బీజేపీలోకి పట్టుకురండి మోడీ అత్యవసర ఆదేశాలు..??

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో జరగబోయే ఎన్నికలలో బిజెపి క్షేత్ర స్థాయిలో రాణించడానికి సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండటంతో పాటు కేసిఆర్ కి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ బిజెపిలో ఏ నాయకుడికి లేకపోవడంతో తాజాగా బీజేపీ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి.

News18 Telugu - తెలంగాణలో క‌రోనా క‌ట్ట‌డిపై జోక్యం చేసుకోండి.. ప్ర‌ధానికి రేవంత్ లేఖ |congress mp revanth reddy writes letter to pm modi over cases rise in telangana- Telugu News, Today's Latest ...రాజకీయంగా మొదటి నుండి టార్గెట్ చేస్తూ ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టిడిపి పార్టీలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాణిస్తున్న రేవంత్ రెడ్డి చాలా వరకు కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి అంత పోటుగాడు లేరు అన్న వార్తలు కూడా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ లో కూడా ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా త్వరలో కేసిఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడానికి పూనుకున్న తరుణంలో కేసీఆర్ కే చెక్ పెట్టడానికి మోడీ సరికొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే రేవంత్ రెడ్డిని తెలంగాణ బీజేపీ లోకి తీసుకురావాలని మోడీ అత్యవసర ఆదేశాలు రాష్ట్ర బిజెపి నేతలకు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అంతేకాకుండా ఒక కండిషన్ మీద రేవంత్ రెడ్డికి ఈ ఆఫర్ ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ నేతలు రెడీ అయినట్లు టాక్.

 

ఆ కండిషన్ చూస్తే పార్టీలోకి వచ్చిన అధ్యక్ష పదవి ఇచ్చేది లేదని సొంత నిర్ణయాలు మేరకు ప్రత్యర్థులపై మాట్లాడకూడదని డిసైడ్ అయ్యినట్లు టాక్. ఆ కండిషన్ మీద రేవంత్ రెడ్డిని తెలంగాణ బిజెపి నేతలు తీసుకువచ్చేలా మోడీ మరియు ఢిల్లీ బిజెపి నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్నాయి. మరోపక్క జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి పార్టీ పూర్తి బాధ్యతలు అప్పజెప్పడానికి రెడీ అవుతున్నట్లు టాక్. మరి ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి హైకమాండ్ ఆఫర్ కి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.