RRR Case: ఫోన్ కాల్స్ డేటా..? సీఐడీ గట్టిగానే కెలుకుతుంది.. RRR స్ట్రాంగ్ గానే బదులిస్తున్నారు..!

YS Jagan Bail Case: Over Expectations of That Media
Share

RRR Case: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని ఏపీ సీఐడీ గట్టిగానే కెలుకుతున్నట్టు కనిపిస్తుంది.. అవకాశం దొరికిన ప్రతీ అంశంలోనూ శోధన లోతుగా చేస్తూ ఆయన చుట్టూ ఉన్న వలయాన్ని చేధించే పనిలో అంతర్గతంగా.., అనధికారికంగా నిమగ్నమయినట్టే ఉంది.. అయితే RRR కూడా ఏమి తక్కువ కాదు. ఆయన తన నెట్ వర్క్, కన్నింగ్ ఐడియాలజీ, ప్రాధమిక న్యాయ సూత్రాలతో ఏపీ సీఐడీకి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఈరోజు ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి కూడా దీనిలో తలదూర్చడం.. తనకు రఘురామా నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని చెప్పడం.. దానికి రఘురామా స్పందించి, వెంటనే లీగల్ చర్యలు తీసుకోమంచి సలహా ఇవ్వడం చూస్తుంటే.. ఈ వివాదం చాలా దూరం వెళ్లేలానే కనిపిస్తుంది..

RRR Case: AP CID Going in Depth.. RRR Call List..?
RRR Case: AP CID Going in Depth.. RRR Call List..?

RRR Case: పీవీ రమేష్ ట్వీట్ తో మళ్ళీ కొత్తగా..!

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అందరికీ బాగ్ తెలిసిన మనిషే. జగన్ ప్రభుత్వంలో సలహాదారుడిగా కూడా పని చేసి.. సలహాలకు విలువలేదని మానేశారు. ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేశారు. “తనకు, తన కుటుంబ సభ్యులకు రఘురామా నంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని.. దీనిపై రఘురామా స్పందించాలని త్వేట్టెర్ వేదికగానే అడిగేసారు.. దీనికి రఘురామకృష్ణంరాజు కూడా వేగంగానే రియాక్ట్ అయ్యారు.. “మే 14 నుండి జూన్ 1 వరకు నా ఫో సీఐడీ అదనపు డీజీకి లీగల్ నోటీసులు ఇవ్వండి.. అంటూ సలహా ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని లోతుగా అర్ధం చేసుకుంటే.. సీఐడీ ద్వారా రఘురామా నంబర్ ఇంకా శోధన దశలోనే ఉన్నట్టు గుర్తించవచ్చు. అయితే ఇది అధికారికమా..? అనధికారికమా..? కోర్టులు అంగీకరిస్తాయా..? అనేదే పెద్ద ప్రశ్న..!

Read It: మాజీ ఎంపీ మాగంటి బాబు కొడుకుల మరణాల మిస్టరీ ఏంటి..!? 

RRR Case: AP CID Going in Depth.. RRR Call List..?
RRR Case: AP CID Going in Depth.. RRR Call List..?

కోర్టుకి వెళితే ఏమవుతుంది..!?

ఒక్కటి మాత్రం స్పష్టం.. రఘురామకృష్ణంరాజు ఫోన్ ఆయన దగ్గర లేదు. అందుకే ఆయన ఈరోజు సీఐడీ పోలీసులకు లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. తన ఫోన్ తిరిగి ఇవ్వాలని కోరారు. ఆ నంబర్, ఆయన ఫోన్ ఆయన దగ్గర లేకుండ ఆ నంబర్ నుండి వేరే వాళ్లకి మెసేజ్ లు చేయడం చట్టం అంగీకరించదు. అయితే పోలీసులు పరిశోధనలో భాగంగా చేయొచ్చు. అధికారికంగా.. సూటిగా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ రఘురామా వ్యవహారమే అనుమానం. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకు వెళ్లోద్దని కోర్టు చెప్పింది. విచారణను పూర్తిగా ఆపలేదు, కానీ తాత్కాలికంగా ఆపాల్సి ఉంది. ఈ సమయంలో రఘురామ నంబర్ నుండి మెస్సగెస్ లు వెళ్లడం అంటే వివాదాస్పద అంశమే.. దీనిపై కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది… ఈ కేసులో అటు పోలీసులు గట్టిగానే నిలబడి, లోతుగా అన్ని మూలలను కెలుకుతుండగా.., ఇటు RRR కూడా ఎక్కడా తగ్గడం లేదు..


Share

Related posts

రాజు గారు ఏం ఫిక్స్ అయ్యారో.. !

somaraju sharma

Pawan kalyan : బలం – బలగం – తెగువ చూపించిన పవన్ :: చంద్రబాబు + జగన్ అడ్డాలో జనసేన ఘన విజయం ?

sekhar

జీతాల్లేవ్… అర్ధం చేసుకోండి

somaraju sharma