NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఎస్ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సజ్జల సున్నితంగా, మంత్రి అమరనాథ్ ఘాటుగా కౌంటర్ లు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి గుడివాడ అమరనాథ్ లు స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సున్నితంగా కౌంటర్ ఇవ్వగా, మంత్రి అమరనాధ్ ఘాటుగా స్పందించారు. ఏపి ప్రభుత్వం ఉపాద్యాయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తొందనీ, వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తొందని వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వారి రాష్ట్ర విషయాలను ఆయన చూసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహా మరేమీ ఉండదని అన్నారు సజ్జల. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగానే వ్యవహరిస్తొందని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్దమని అన్నారు. హరిష్ రావు ఇాలంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్దం కావడం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని వ్యాఖ్యానించారు. సజ్జల ఈ విధంగా కౌంటర్ ఇవ్వగా, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఘాటుగా స్పందించారు.

Sajjala Amarnath

 

ఏపికి తాము చేశామో హరీష్ వచ్చి చూడాలని అన్నారు అమరనాథ్. మేనమామపై ఏదైనా గొడవ ఉండి తిట్టాలనుకుంటే నేరుగా ఆయన్నే తిట్టవచ్చు గానీ ఇలా మమ్మల్ని హరీష్ ఏమైనా అంటే మేము కేసిఆర్ ను విమర్శిస్తే (తిడితే) ఆనందపడదామనుకుంటున్నారేమో అని అన్నారు. వాళ్లకు వాళ్లకు ఏమైనా ఉంటే వాళ్లు చూసుకోవాలని అమరనాథ్ హితవు పలికారు. మామ (కేసిఆర్), అల్లుడు (హరీష్) మద్య ఏమైనా గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు తేల్చుకోవాలని గానీ మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వ అధికారులను ఏ విధంగా ట్రీట్ చేశారో ప్రజలు చూశారని అన్నారు. నోటికి వచ్చినట్లు తిట్టి, ప్రభుత్వ అధికారిని హరీష్ రావు బూటు కాలితో తన్నిన సందర్భాలు చూడాలేదా అని ప్రశ్నించారు.

కేసిఆర్ ను, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్బాగ్యమైన పరిస్థితిలో వైసీపీ లేదని అన్నారు. 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమం ఏమిటో చెప్పాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏమి చేశామో చెప్పగలమని అన్నారు. తరచు తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఏపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో సందర్భంగా సీఎం కేసిఆర్ సైతం ఏపి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. అయితే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపి మంత్రి అమరనాథ్ ఘాటుగా స్పందించి ప్రతి విమర్శలు చేయడం విశేషం. అమరనాథ్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారో మరి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju