Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ప్రవాసాంధ్రుడు అంటూ సజ్జల హాట్ కామెంట్స్

Share

Sajjala Ramakrishna Reddy: ఏపిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజులుగా 20వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్రంలో బుధవారం నుండి పగటి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ కోవిడ్ పేషంట్స్ కు అందుతున్న వైద్యసేవలు, వసతులు. వ్యాక్సినేషన్ తదితర విషయాలపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే కరోనా వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ రోగులకు సరైన వైద్య సౌకర్యం అందడం లేదనీ, ఆక్సిజన్ అందక ఆసుపత్రుల్లో రోగులు మృతి చెందుతున్నారనీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ. కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ఇలా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే చంద్రబాబు గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలోనూ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ హైదరాబాద్ నుండే పార్టీ కార్యక్రమాల నిర్వహణ సాగిస్తున్నారు.

Sajjala Ramakrishna Reddy hot comments on chandrababu
Sajjala Ramakrishna Reddy hot comments on chandrababu

జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండవనీ, కేంద్రం ఆధీనంలో ఉంటాయనే విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాలకంటే ఏపి మెరుగ్గా ఉంటే పొరుగు రాష్ట్రంలో దాక్కున్న ప్రవాసాంధ్రుడు చంద్రబాబు ప్రతి రోజు టీడీపీ నేతలతో జూమ్ మీడింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రజల సంక్షేమం తప్ప వేరే ధ్యాస లేదన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడానికి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోజుకు ఆరు లక్షల డోస్ ల వరకు కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించే సామర్థ్యం ఏపి ప్రభుత్వానికి ఉందని అన్నారు. కేంద్రం సరిపడా వ్యాక్సిన్ డోసులు అందిస్తే కేవలం 35 రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని సజ్జల పేర్కొన్నారు. ప్రజా రోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని సీఎం జగన్మోహనరెడ్డి కరోనా ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు.


Share

Related posts

సాయి ధరం తేజ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నాడు .. అందుకే ఏమాత్రం తగ్గడం లేదు ..!

GRK

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూడకండి డిసప్పాయింట్ అవుతారంట.. ఎందుకో తెలుసా ..?

GRK

భేష్.. బైడెన్.., కొత్త నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు

Vissu