NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

చీరల ఓట్లు..! కేసీఆర్‌కి కలిసొస్తుందా..??

 

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై అప్పుడే అధికార టీఎస్ఆర్ పార్టీతో సహా బీజెపి, కాంగ్రెస్, ఏంఐఎంలు దృష్టి సారించాయి.  జీహెఎంసీలో మళ్లీ తమ హావా చాటుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావుకు, జీహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ కు అప్పగించారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కెటిఆర్ పేర్కొంటూ పార్టీ శ్రేణలను సన్నద్దం చేస్తున్నారు.

బతుకమ్మ చీరలతో మహిళలకు గాలం

మరో పక్క అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా చీరల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నది. ప్రతి ఎటా దసరా పండుగకు ముందు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తున్నది. గతంలో తెలంగాణ జిల్లాలకే ఎక్కువగా పంపిణీ చేసే బతుకమ్మ చీరలను ఈ ఏడాది హైదరాబాద్‌లో కూడా భారీగా పంపిణీ చేయాలనికి సిద్ధం అవుతున్నది. జీహెచ్ఎంసి ఎన్నికల కారణంగానే హైదరాబాదు నగరంలో ఎక్కువగా పంపిణీ చేయాలని కసరత్తు చేస్తున్నది టీఆర్ఎస్ సర్కార్. ఇప్పటికే బంగారు, వెండి అంచుల డీజైన్‌లతో చీరలను సిద్ధం చేశారు. ఈ చీరలకు గానూ ప్రభుత్వం ఏకంగా 318 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.

మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు

ప్రతి కార్పోరేషన్‌లలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించాలని ఇప్పటికే మంత్రి కెటిఆర్ ఆదేశించారు. మరో ఈ సారి ఎన్నికల్లో పాత బస్తీలోనూ టీఆర్ఎస్ హావా చాటాలని చూస్తున్నదట. గతంలో టీఆర్ఎస్, ఎంఐఎంల మద్య మంచి సంబంధాలు కొనసాగిన నేపథ్యంలో పాత బస్తీలో ఎంఐఎంహవా కొనసాగుతోంది. మజ్లీస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నా ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎంఐఎంతో పేచీ వచ్చే అవకాశం ఉండటంతో పాత బస్తీలోనూ పార్టీ పటిష్టం కోసం కృషి చేయాలని కెసిఆర్ పార్టీ నేతలను ఆదేశించారని వార్తలు వస్తున్నాయి. పాత బస్తీలో బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకుని అభ్యర్థుల విజయానికి కృషి చేస్తే వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడమో లేక ప్రాధాన్యత కల్గిన నామినేటెడ్ పోస్టులు అప్పగిస్తామని కూడా ఆశ చూపుతున్నారని టాక్.

గత జీహెచ్ఎంఎస్ ఎన్నికల్లో 150 కార్పోరేషన్‌లకు గానూ  99 స్థానాలు టీఆర్ఎస్ కైవశం చేసుకుని అతి పెద్ద పార్టీగా నిలవగా 44 సీట్లతో ఎంఐఎం రెండవ స్థానంలో నిలచింది. బిజెపి నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ రెండు, టీడీపీ ఒక స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju