NewsOrbit
రాజ‌కీయాలు

నిమ్మగడ్డ పెద్ద స్కెచ్చే వేశారు…!!

ys-jagan-nimmagadda-blackmailing-ys-jagan

నిమ్మగడ్డ రమేష్..! నాలుగు నెలల కిందటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తి.., మూడు నెలల కిందట ఆకస్మికంగా తెరపైకి వచ్చిన వ్యక్తి…! సీఎం జగన్ కి మింగుడు పడని వ్యక్తి, చంద్రబాబు బృందానికి ఆయుధంగా మారిన వ్యక్తి..! ఇప్పుడు ఆయన ఏపీలో ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఇప్పుడు ఈయన గురించి చెప్పుకోవడం ఎందుకు అంటే…??? నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ నేత సుజనా చౌదరి ముగ్గురు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ నెల 13న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గంటకి పైగా ముగ్గురు రహస్యంగా భేటీ అయ్యి కొన్ని చర్చలు జరిపి… ఎవరికి వారు తెలియనట్టుగా జారుకున్నారు. ఇక్కడ ఏదో దాగుంది.., అంతర్గతంగా ఏదో జరుగుతుంది..? ఒక రాజ్యాంగ బద్ధంగా కీలక హోదాలో ఉన్న అధికారితో బీజేపీ నాయకులు, అందునా ఓ సామాజిక వర్గంలో కీలక నాయకులు భేటీ అవ్వడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

జగన్ అన్న మాటలతో…!!

మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు జగన్ కి నిమ్మగడ్డ రమేష్ ప్రత్యర్థి అయ్యారు. జగన్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఏమన్నారు…? కులాన్ని లేవనెత్తారు. ఆ కులం అధికారం, ఆ సమాజికవర్గా నాయకులు కలిసి డ్రామాలు ఆడుతున్నారంటూ ఏకి పారేశారు. చెడామడా నాలుగు వాయించేసి, కొద్దీ రోజులకే నిమ్మగడ్డ స్థానంలో మరో అధికారిని నియమించేశారు. అక్కడితో జగన్ పని అయిపోయింది. సీఎం గా తాను చేయాల్సింది సింపుల్ గా చేసేసి, తను తలచుకుంటే ఏం చేయగలనో చూపించారు. కానీ….అక్కడితో జగన్ అగ్గి రాజేశారు అనే విషయాన్ని నెమ్మదిగా తెలుసుకున్నారు.

సామాజిక వర్గమే పరమావధి…!

నిమ్మగడ్డ రమేష్ కి అనుకూలంగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ వేసారు. ఆ తర్వాత సుజనా చౌదరిని కలిశారు. కోర్టులో గెలిచారు. సంతోషమే. తమ పంతం నెగ్గించుకున్నారు. కానీ అక్కడితో ఆగితే జగన్ పంతం ఎక్కడ నెగ్గుతుంది..!!? అందుకే జగన్ తరపున మరో పిటిషన్ దాఖలయింది. నిమ్మగడ్డ కి పోస్టు ఇవ్వబోమంటూ, సుప్రీం కి వెళ్లారు. అక్కడ రకరకాల వాదనాలు జరుగుతూ ప్రస్తుతానికి ఏమి స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి రసస్య భేటీ అత్యంత చర్చకు దారితీస్తుంది. సుజనా, కామినేని, నిమ్మగడ్డ ముగ్గురూ ఒకే సామాజిక వర్గం. జగన్ కి వ్యతిరేక సామాజిక వర్గం. అధికారంలో ఉన్నన్నాళ్లు ఇష్టానుసారం చేసిన సామాజికవర్గం. ఈ ముగ్గురి భేటీ వెనుక అనేక కారణాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రం సామాజికవర్గం ఏకమై లాబీయింగు, రహస్య అజెండాలు నడుపుతున్నట్టే. అంటే తనకు మద్దతుగా నిమ్మగడ్డ సామాజికవర్గం సాయం తీసుకోవడం… రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ ముగ్గురి వెనుక ఉన్నది, ఈ సామాజికవర్గన్ని నడిపిస్తున్నది.., జగన్ అనుకూలలకి తెలియని విషయం కాదులే.

author avatar
Srinivas Manem

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!