Subscribe for notification

సేనకో ఆశల దివిటి!! పవన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారా??

Share

 

 

తూర్పుగోదావరి జిల్లా దివిస్ బాధితుల తరుపున జనసేన పోరాట పంథ ఓ చక్కటి రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి వైసిపిలు విఫలమైన ఓ సమస్యను జనసేన భుజానికి ఎత్తుకోవడం ఆ పార్టీకి ఎంతో లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అందులోనూ పవన్కళ్యాణ్ ప్రభావితం చేయగల తూర్పుగోదావరి జిల్లాలో ఈ అంశాన్ని పార్టీ గుర్తించి మొత్తం పోరాటాన్ని… తమ భుజాలకు ఎత్తుకోవడం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దివిస్ పోరాటం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం వల్ల జనసేన శ్రేణులు లోనూ నాయకులను కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాస్తోకూస్తో ఎక్కువ ప్రభావం చూపగల పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలకమైన ప్రజా సమస్యను ముందుకు తీసుకెళ్లడం వల్ల పార్టీ అన్ని రకాలుగానూ లాభ పడుతుందని అర్థం అవుతోంది.

 

రెండూ పార్టీలకు దూరంగా!!

**రాష్ట్రంలో కీలకంగా ఉన్న అధికార పార్టీ వైసీపీ సీటు విపక్షం టిడిపిలకు సమదూరం పాటించాలని జనసేన భావిస్తోంది. దివిస్ పోరాటంలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు విఫలమైన చోట జనసేన పార్టీ సమస్యను రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటు టిడిపినీ ఈ విషయంలో ఇరికించి… వారికి దూరంగా ఉన్నామని సందేశం ఇచ్చినట్లు ఒక ఎత్తు అయితే…. ఇటు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివిస్ బాధితులకు అండగా ఉంటామని దివిస్ పరిశ్రమను అక్కడినుంచి తరలిస్తామని ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దివిస్ బాధితుల మీద కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ అధికారపక్షాన్ని సైతం ఇరుకున పెట్టేందుకు పవన్ ఆలోచిస్తున్నారు. అంటే మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం తరఫున కాదు అనే కోణాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లేందుకు అందులోనూ తూర్పుగోదావరి లాంటి పెద్ద జిల్లాలో ఈ విషయాన్ని కీలకంగా నొప్పి చెప్పేందుకు పవన్ పర్యటన ఎంతో లావు పడుతుందనేది జనసేన నాయకులు అంచనా. చెప్పడానికి కేవలం ప్రజా సమస్యల కోసమే తాము వస్తున్నామని జనసేన చెబుతున్న దాని వెనుక రాజకీయ సిద్ధాంతం ఉద్యోగం ఉంది అనేది విశ్లేషకుల అంచనా.

ఫలిస్తుందా… లభిస్తుందా!

**జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క సీటు తూర్పుగోదావరి జిల్లాలోది… కాపులు ఎక్కువగా ఉండే తూర్పుగోదావరి లాంటి పెద్ద జిల్లాలో పార్టీ మనుగడ ను, పార్టీ విస్తరించడాన్ని పవన్ ఎక్కడి నుంచి మొదలు పెడతారా అనేది ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న. దీనికి అనుగుణంగా అక్కడి నాయకులు సైతం పదేపదే పవన్ జిల్లా పర్యటనకు రావాలని కోరుతున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని వదిలేస్తాను అని చెప్పిన సమయంలో సైతం పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమాన్ని భుజానికెత్తుకుంటే పార్టీకి లాభిస్తుందని పలువురు సూచనలు చేసిన పవన్ దానికి విముఖత చూపారు. పార్టీ ఒకే వర్గానికి కట్టుబడి ఉంటే… ఒక రకమైన భావం ప్రజల్లోకి వెళ్తుందని కాపు ఉద్యమానికి కనీస మద్దతు తెలిపే మాటలు సైతం పవన్ మాట్లాడలేదు. దీంతో అప్పట్లోనే కాపు నాయకులు గోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు దివిస్ పోరాటాన్ని పార్టీ రాజకీయ ఎదుగుదలకు సైతం ఉపయోగించుకుంటే తూర్పుగోదావరి జిల్లా లాంటి పెద్ద జిల్లాలో బాగా లభిస్తుందని… ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తే కనుక అది పార్టీ క్రెడిట్ గా మిగిలిపోతుందని భావిస్తున్నారు.

గతంలో వలే వదిలేస్తారా!!

**ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్… అప్పుడప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారని అపవాదును మూటగట్టుకున్నారు. గతంలో పవన్ ఎంతో ఘనంగా భుజానికెత్తుకున్న ఉద్యమాలు సైతం తర్వాత ఆయన వదిలేశారు. వాటిని పూర్తి చేయకుండానే కేవలం ప్రారంభించడం వరకు మాత్రమే నా బాధ్యత అనేలా ఆయన కొన్ని ఉద్యమాలను మధ్యలోనే వదిలేశారు. ఉద్దానం కిడ్నీ సమస్య కానీ, కాకినాడ హోప్ ఐలాండ్ సమస్యని, డెంకాడ భూముల సమస్య, ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ సమస్య గాని అన్నీ మంచి సమస్యలే. గుర్తించే వాణ్ని అద్భుతంగానే ఉన్నా కేవలం దానిని ప్రచారానికి లేదా, ప్రారంభానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. తర్వాత కనీసం ఢిల్లీ చూసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు దివిస్ లేబరేటరీ సమస్యను కూడా పవన్ ఇలాగే ప్రారంభించి వదిలేస్తారా లేక చివరకు తీసుకెళ్తారా అన్నది జనసైనికుల్లోనే మెదులుతున్న ప్రశ్న. అయితే తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం చూపించాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళితే పార్టీకి మంచి మైలేజీ వస్తుందని… ఆ పార్టీ నాయకులు కోటి ఆశలతో ఉన్నారు.


Share
Comrade CHE

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

7 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

7 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

19 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago