NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

షర్మిల పార్టీ నిజమేంత! వైఎస్ కుటుంబం నుంచి ఖండన ఏది??

ఆదివారం వార్తలానన్నీ పక్కన పెట్టి మరీ…. సంపాదకీయం పేజీని మొదటిపేజీలో అచ్చువేసి మరీ వైయస్ జగన్మోహన్రెడ్డి చెల్లెలు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతోందని.. జగనన్న తీరు మీద ఎంత కోపంగా ఉందని కనీసం కుటుంబ సభ్యులు ఫోన్ లు సైతం ఎత్తడం లేదని ఇప్పటికే వైయస్ సహచరులను కలుసుకుంటుంది అని… దీనికి తగిన నిధులను సిద్ధం చేసుకుందని ఇక కొత్త పార్టీ ప్రకటన తరువాత అన్నట్లుగా ఆంధ్రజ్యోతి ఆర్కే కథనం వండి వడ్డించిన సరే దాని మీద వైయస్ కుటుంబం నుంచి కనీస స్పందన స్పందన లేకపోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇంతటి ప్రాధాన్యమైన కథనాన్ని వైయస్ కుటుంబం లైట్ తీసుకుందా లేక కావాలనే స్పందించడం మానేసిందా? షర్మిల పార్టీ పెట్టడం కన్ఫర్మ్ అయిందా అనేది చాలామందిని ఆదివారం నుంచి వేధిస్తున్న ప్రశ్న.

ఆంధ్ర లో కదా పెట్టాల్సింది!

జగన్ తో విభేదాలు ఉన్న ఆయనతో సరిగా పడకపోయిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ప్రయోజనం ఏమిటి? అక్కడ షర్మిలకు ఉన్న అభిమానంతో పార్టీని ఎలా నడిపించగలదు?? ఒకవేళ జగన్ తో కనపడకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలి…. అన్నకు వ్యతిరేకంగా పని చేయాలి.. మరీ తెలంగాణ లో షర్మిల పార్టీ పెట్టి ఏం చేస్తారు? అన్న ప్రశ్న వేదిస్తోంది. ఒకవేళ జగన్తో పడక పోతే షర్మిల డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడే అంత చనువు ఉంది. మరి ఏబీఎన్ ఆర్కే వారు చెప్పినట్లు కేవలం రాజ్యసభ సీటు గురించి షర్మిల ఏకంగా పార్టీ పెట్టి దానిని నడిపించగల రా అన్నది ఆయనే సమాధానం చెప్పాలి.
** అయితే దీని వెనుక మరో కోణం కూడా ఉన్నట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. మరోపక్క తెలంగాణవాదం, ప్రాంతీయవాదం మాటలకు అంతగా ఓట్లు పడే పరిస్థితి తెలంగాణలో లేదు. మరోపక్క హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో ఆంధ్రా సెటిలర్లు పూర్తిగా కేసీఆర్ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇది ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఈ సమయంలో బిజెపి ని దెబ్బ కొట్టాలంటే దానిని బలపడకుండా చూడాలి అంటే… ఓ కొత్త ఆంధ్ర పార్టీ ఓట్లను చీల్చి గలగాలి.. సెటిలర్ల ఓట్లను పొందగల పార్టీ కెసిఆర్ కు అవసరం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, సెటిలర్ల ఓట్లను చీల్చడానికి పార్టీ వల్ల బిజెపి కు నష్టం జరుగుతుంది. ఇది కేసీఆర్ కు కావాలి. ఈ ప్లాన్లో భాగంగానే మిత్రుడు జగన్తో రకరకాల రాజకీయ చర్చలు జరిపిన తర్వాత… షర్మిలతో ఆంధ్ర పరిస్థితులకు తగినట్లుగా వారి ఓట్లను తిప్పుకొని రెడ్డి ఓటర్లను ప్రభావితం చేయగల పార్టీ పెట్టిస్తే రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చు అన్నది కేసీఆర్ జగన్ ప్లాన్ అని దీనిలో భాగంగానే షర్మిల పార్టీ పెట్టే అవకాశం కూడా ఉందని విశ్లేషిస్తున్నారు.

ఎందుకు మౌనం!

ఆంధ్రజ్యోతి పత్రికలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత కథనం వచ్చిన దాన్ని ఖండించే ఎందుకు వైఎస్ఆర్ సీపీ నాయకులు ముందు ఉంటారు. అయితే ఆంధ్ర జ్యోతిలో వచ్చిన కధనం ఎంత పెద్దదైన వైఎస్ఆర్సిపి లో జరుగుతున్న విషయాలను బయటపెట్టింది వైయస్సార్ కుటుంబంలో ఉన్న విభేదాలను బయట పెట్టేది ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు వైఎస్ఆర్ సీపీ నాయకులు వైయస్సార్ కుటుంబ సభ్యులు గాని దీనిని ఖండించకపోవడం విశేషం. కనీసం జగన్ చెల్లెలు షర్మిల నుంచి కూడా దీనిపైన ఖండన వార్త ఒకటి కూడా రాకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తుంది. మరోపక్క జగన్ శిబిరం నుంచి కూడా దీనిని ఖండించే లా… పూర్తిగా ఆర్కే కథనాన్ని తప్పు పట్టేలా ఎవరూ కనీసం విలేకరుల సమావేశం పెట్టి చెప్పక పోవడం విశేషం. వైఎస్ఆర్సిపి నాయకులు వద్ద కూడా ఈ పార్టీ గురించి ప్రశ్నిస్తే వారు సమాధానం దాటవేత కే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పితే దీనిని ఖండించే సాహసం చేయలేకపోతున్నారు. మరి ఏబీఎన్ ఆర్కే వారు చెప్పినట్లు నిజంగానే వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ మొదలు పెట్టబోతుందా?? దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా? కొంపదీసి ఆంధ్రజ్యోతి రాతలు నిజమేనా అన్న అనుమానం ఇప్పుడు సర్వత్రా కలుగుతోంది.

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju