YS Sharmila : టీవీ 5, ఏబీఎన్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్ర జ్యోతిలను వైసీపీ బ్యాన్ చేసింది.. ఆ విషయన్ని మంత్రి కొడాలి నాని స్వయంగా వెల్లడించారు.. ఇది సబబా, కదా..!? అనే చర్చ అన్ని వర్గాల్లో జరుగుతుంది. కాకపోతే ఆ మీడియాలు చేస్తున్న అతి ప్రచారం, ఆ టీవీల్లో నడుస్తున్న అసత్య కథనాల వలన బ్యాన్ చేసినా తప్పులేదు అనుకోవాల్సి వస్తుంది.. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుబులు రేకిత్తించే వార్త ఒకటి నాలుగు రోజుల కిందట టీవీ 5 లో ప్రసారం అయ్యింది. అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఆ వార్త సారాంశం ఏమిటంటే.. వైసీఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ( Ys Sharmila ) రెడ్డి సీబీఐ పెద్దలకు వైఎస్ వివేకా హత్యకు సంబంధించి కీలక విషయాలను తెలియజేస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించింది. ఆ తరువాత ఇదే విషయాన్ని టీడీపీ అనుకూల మీడియాలో ప్రసారం చేశాయి. ఈ వార్త ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇదే గనుక వాస్తవం అయితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలన అంశమే. తమ సొంతం కుటుంబంలో జరిగిన ఈ ఘటనపై షర్మిల.. సీబీఐకి లేఖ రాయడం అంటే మామూలు విషయం కాదు. వివేకా కుటుంబ సభ్యురాలిగా ఆమెకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఆమే గనుక లేఖ రాస్తే అది తీవ్ర సంచలనం అవుతుంది. నిజంగా ఆమెకు ఆ ఉద్దేశం ఉందా..? ఆమె సీబీఐకి లేఖ రాసే అవకాశం ఉందా..? ఈ లేఖ రాస్తున్న అంశాన్ని నమ్మవచ్చా..? అయితే మీడియా వాళ్లు దాన్ని దృవీకరించలేదు. లేఖ రాయాలి అని అనుకుంటున్నారు అని మాత్రమే చెప్పారు.
అయితే ఈ వార్తపై “న్యూస్ ఆర్బిట్” పలు వర్గాల నుండి సేకరించిన వివరాల ప్రకారం షర్మిలారెడ్డి సీబీఐకి లేఖ రాసే ఉద్దేశంలో లేరని తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆమె లేఖ రాసే అవకాశం లేదని సమాచారం. సోదరుడు జగన్మోహనరెడ్డితో షర్మిలకు కొంత గ్యాప్ ఏర్పడిందని ఇటీవల మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తన సోదరుడిని దారిలో తెచ్చుకునేందుకు కొన్ని కొన్ని అస్త్రాలను ఆమె బయటకు తీస్తున్నారన్న ప్రచారం ఉంది. ఏపిలో పార్టీ పెడతానని ఒకటవ లీక్. పార్టీ పెడతారో లేదో అనేది తరువాత విషయం. కానీ జగన్ ఒక ఆలోచనలో పడతారు కదా. ! ఏపిలో షర్మిల పార్టీ పెడితే వైసీపీకి కొంత నష్టం జరుగుతుందనేది అందరికీ తెలిసిందే.
* వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ అంటూ రెండో లీక్. ఇవన్నీ కూడా బెదిరించి తనకు కావాల్సింది చేయించుకోవడం షర్మిల ఎత్తుగడ అని అనుకుంటున్నారు. ఏపి షర్మిల పార్టీ పెడుతుందా అంటే పెట్టే అవకాశమే లేదు. సీబీఐకి లేఖ రాసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం షర్మిలకు సంబంధించి ఏపిలో పార్టీ ఏర్పాటు విషయం గానీ, వివేకా హత్య విషయంలో లేఖ రాస్తారని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టమైన సమాచారం. అయితే తనకు సంబంధించి ఆస్తి లావాదేవీలు సెటిల్ చేసుకునేందుకే షర్మిల ఈ విధమైన వ్యూహం సిద్దం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* ఏమి లేకుండా బ్రేకింగ్ అంటూ షర్మిల లేఖ అంటూ నానా హడావిడి చేసి.. సీబీఐ కి నిజంగా లేఖ రాసినట్టు బిల్డప్ ప్రసారం చేసిన టీవీ 5 ఇప్పుడు బకరా అయింది. నాలుగు రోజులయినా ఆ లేఖ వాస్తవమే అని తేలకపోవడంతో టీవీ 5 ని ఎల్లో అన్నా తప్పులేదని భావన తటస్థ వర్గాల్లో కూడా నెలకొంది..!
ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు…
టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఓ రేంజ్లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు…
టాప్ 10 తెలుగు ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…
పోయిన శుక్రవారం భారీ అంచనాల నడుమ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటే `బింబిసార`. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…
విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…