NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Babri Masjid demolition: బాబ్రీ మసీదు కూల్చివేతపై మహారాష్ట్రలో మజా రాజకీయం!విధ్వంసం నుండీ లబ్ధి పొందడానికి శివసేన,బీజేపీ పాట్లు!

Babri Masjid demolition:  హిందూత్వ ఎజెండానే కలిగి ఉన్న ఆ రెండు పార్టీలు మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందడానికి ముప్పై ఏళ్ల క్రితం జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను నిస్సిగ్గుగా వాడుకుంటున్నాయి.బాబ్రీ మసీదును మేమంటే మేం కూల్చేశామని బహిరంగ ప్రకటనలు చేసుకునే వరకు ఆ రెండు పార్టీలు వెళ్లాయి.మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన,పూర్వ వైభవాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న బిజెపి ల మధ్య ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది.

Babri Masjid demolition: బీజేపీని కెలికిన శివసేన!

గత నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిందూత్వ గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసే బిజెపి నేతలు బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఎక్కడున్నారని సూటిగా ప్రశ్నించారు.ఆ సమయంలో వారు కలుగులో ఎలుకల మాదిరి దాక్కున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది సుప్రీంకోర్టు తీర్పు కారణంగానే అని,అదేమీ బీజేపీ విజయం కాదని కూడా సీఎం ఉద్దవ్ థాకరే ఆ సభలో ప్రకటించారు.

సీఎం కు దీటుగా మాజీ సీఎం సమాధానం!

దీంతో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రెచ్చిపోయారు.ఉద్దవ్ థాకరే కు దీటైన సమాధానం ఇచ్చారు.”ఎవరో కాదు నేనే బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకులలో ఆరోజున ఉన్నాను.నా చేతులతోనే ఇటుకలు తీసేశాను.అంతేకాదు అక్కడ కరసేవ చేసినందుకు పధ్ధెనిమిది రోజుల పాటు నన్ను బదాన్ జైల్లో కూడా పెట్టారు.కావాలంటే ఆ రికార్డులను ఎవ్వరైనా చూసుకోవచ్చు” అని ఫడ్నవిస్ ఒక ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి,ఉమా భారతి,వినయ్ కతియార్,సాధ్వి రీతాంబరి,కల్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న విషయం దేశం మొత్తానికి తెలుసు అని కూడా ఫడ్నవీస్ ఉద్ఘాటించారు.అసలు ఆ రోజున శివసేన నాయకులు ఎవ్వరు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నారో చెప్పాలని ఆయన ప్రతి సవాల్ విసిరారు.మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని కోరితే వణికిపోయిన శివసేన నాయకులా బాబ్రీ మసీదు కూల్చివేత గురించి, అందులో బీజేపీ పాత్ర గురించి మాట్లాడేది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

సీబీఐ డెయిరీ చూసుకోండి!

ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆ రోజున ఎవ్వరు పాల్గొన్నదీ సీబీఐ డెయిరీలో ఉంటుందని, దాని చూసుకోవాలన్నారు.బాబ్రీ మసీదు కూల్చివేతలో శివసేన పాల్గొన్నదీ లేనిది సీబీఐ రికార్డ్స్ లో ఉంటుందని,మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఆ మాత్రం తెలియకపోవటం విచారకరం అని సంజయ్ రౌత్ కౌంటర్ వేశారు.అయినా ఎవ్వరేమిటో మహరాష్ట్ర ప్రజలకు తెలుసునని,బిజెపి ప్రగల్భాలను వారు నమ్మబోరని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

author avatar
Yandamuri

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju