దాదాపు 15 మంది టీడీపీకి షాక్..!!

చంద్రబాబు రాజకీయ అనుభవం వయసు కలిగిన సీఎం జగన్ ఎత్తుగడలకి టిడిపి పార్టీ కంచుకోటలు బద్దలు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన సంక్షేమ పథకాలతో జగన్ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందించడంతో జగన్ క్రేజ్ ఏపీలో ఉన్న కొద్ది పెరుగుతున్నట్లు టాక్. బీసీలకు సంబంధించి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా పార్టీలో వారికీ ఇస్తున్న పదవులకి బీసీ సామాజిక వర్గాల ఆదరణ వైసిపి దక్కించుకుంటున్నట్లు వార్తలు ఏపీ రాజకీయాల్లో బలంగా వినబడుతున్నాయి.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూతవాస్తవానికి బీసీలు ముందు నుండి టిడిపి పార్టీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. విభజన జరిగిన తర్వాత కూడా జరిగిన రెండు ఎన్నికలలో బీసీలు చాలా వరకు టీడీపీకే అండగా ఉండటం జరిగింది. అయితే ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరియు చాలా పదవులు బిసి వర్గాలకు కల్పిస్తున్న తరుణంలో టీడీపీలో ఉండే బీసీ నాయకుల దృష్టి కూడా వైసిపి పై పడినట్లు, దీంతో.. దాదాపు 15 మంది టిడిపిలో ఉండే బలమైన బీసీ నేతలు త్వరలో వైసీపీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

చాలావరకు టీడీపీ ఓటు బ్యాంకు డామేజ్ అవుతున్న తరుణంలో చంద్రబాబు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టే విధంగా తాజాగా పార్టీకి సంబంధించి ప్రకటించిన కొత్త కమిటీలలో బీసీలకే ప్రాధాన్యం ఇచ్చే రీతిలో వ్యవహరించడం జరిగిందని పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్. ఉన్న ఈ ఓటు బ్యాంకు వైసిపి కి వెళ్ళింది అంటే.. రానున్న రోజుల్లో మరింత కష్టమవుతుందని బాబు భావించి చాలావరకు టిడిపి కొత్త కమిటీ అధ్యక్ష పదవులు బీసీ వర్గానికి అప్పచెప్పడం జరిగిందట. ఏదిఏమైనా ఏపీలో ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే బీసీలు కూడా జగన్ కి ఆకర్షితులవుతున్నట్లు వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.