NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మ‌ళ్లీ ఎన్నిక‌లు… వైసీపీ, టీడీపీ షాకింగ్ నిర్ణ‌యం

ap government upper hand on nimmagadda

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుండ‌గా మ‌రోవైపు మాట‌ల యుద్ధం సైతం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల కేంద్రంగా విమ‌ర్శ‌ల ప‌ర్వం సాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ap government upper hand on nimmagadda

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ భేటీ కానున్నారు. ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కథ ఏంటంటే…

ఏపీలో ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మార్చి 15న ప్రకటించారు. మొత్తం రెండు దశల్లో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. 2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు కూడా అప్పుడు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.

నిమ్మ‌గ‌డ్డ ర‌చ్చ మామూలుగా లేదుగా

అయితే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ తప్పు పట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించి మరొకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిపై రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో జగన్‌ సర్కార్‌ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి నియమించింది. ఇటీవల హైకోర్టులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లు తెర‌మీద‌కు వ‌చ్చింది.

28న అస‌లు క‌థే

ఈనెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయిందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే ఎస్‌ఈసీకి ప్రతిపక్షాలన్నీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

author avatar
sridhar

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju