ఏపీలో క‌రోనా కొత్త ట్విస్ట్‌… చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌రోనా క‌ల‌క‌లం పెద్ద ఎత్తున కొన‌సాగుతున్న రాష్ట్రాల్లో ఒక‌టైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. గ‌త కొద్దిరోజులుగా కేసుల న‌మోదులో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తుండ‌గా ఇప్పుడు మార్పు వ‌చ్చింది. kathi mahesh says andhra pradesh is safe from corona virus

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2997 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. ఇందులో 7,69,576 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,860 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

 

క‌రోనాలో ఏం జ‌రుగుతోందంటే…

మన దేశంలో ఇప్పటివరకు కరోనా రికవరీ రేటు 80 శాతం పైగా ఉంది. ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం దేశంలో కరోనా రికవరీ మరింత బాగా పెరిగినట్లు సమాచారం. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేష్, కర్ణాటకా, అమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలలో 61 శాతం రికవరీ నమోదు అయింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ 90 శాతానికి చేరిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ దేశంలో 78.15 లక్షల కేసులు నమోదయ్యాయి. అందులో 70.16 లక్షల మంది రికవరీ అయినట్లు తెలిపారు. అయితే శనివారం జరిగిన 650 మరణాలతో కలుపుకుని మరణాల రేటు 1.18 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 53,370 కొత్త కేసులు నమోదయ్యయి. అదేవిధంగా 24 గంటల్లో 67,549 మంది రికవరీ అయినట్లు తెలిపారు.

ఏపీలో ఏం జ‌రుగుతోందంటే….

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6587కి చేరింది. జిల్లాల వారీగా చూసుకుంటే, అనంతపూర్ లో 108,చిత్తూరులో 466, తూర్పు గోదావరిలో 254, గుంటూరులో 301, కడపలో 153, కృష్ణాలో 358, కర్నూల్ లో 67, నెల్లూరులో 96, ప్రకాశంలో 340, శ్రీకాకుళంలో 86, విశాఖపట్నంలో 187, విజయనగరంలో 89, పశ్చిమగోదావరి జిల్లాలో 492 కేసులు నమోదయ్యాయి.

 

బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అయితే, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు. కరోనా గురించి సీఎం జగన్ చాలా చులకనగా మాట్లాడారన్నారు. కనీసం రివ్యూ మీటింగ్‌లు పెట్టలేదన్నారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంటే ప్రభుత్వం మాత్రం తేలికగా తీసుకుందన్నారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.. కరోనాపై ప్రధాని మోదీ ఏడుసార్లు జాతినుద్దేశించి మాట్లాడారన్నారు చంద్రబాబు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని, వారిని గౌరవించాలన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు.