NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబుకు అదిరిపోయే షాక్ … ఇంత త‌క్కువ టైంలో జ‌గ‌న్ చేస్తారంటే

ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష్యంగా ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఎత్తుగ‌డ‌లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిని తిప్పికొట్టే విష‌యంలో వైసీపీ సైతం అదే వ్యూహంతో ముందుకు సాగుతోంది.

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా ఈ రెండు పార్టీలు త‌మ త‌మ గేమ్ ప్లాన్ అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఊహించ‌ని రీతిలో చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చాయి.

వరుస‌గా జ‌గ‌న్‌….

ఇటీవ‌లే బీసీల‌కు రికార్డు స్థాయిలో కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీలో బీసీల సంక్షేమంలో జ‌గ‌న్ నిర్ణ‌యం చ‌రిత్ర‌ను సృష్టించింది. అయితే, దీనికి కొన‌సాగింపుగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఇంకో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంను క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. “జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం“ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు.

వైఎస్ఆర్ బ‌డుగు వికాసం…

‘జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం’ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామ‌ని, ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాన‌ని తెలిపారు.
“ఎస్సీలు, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి. ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయలు వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్‌) ఇస్తున్నాం. ఇంకా ఎస్సీ, ఎస్టీలలో పారిశ్రామికవేత్తలను తయారు చేసేలా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకువస్తున్నాము. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్‌ సెల్స్‌ కూడా ఏర్పాటు. వారిలో వారి నైపుణ్యం పెంచేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి ఇంకా పారిశ్రామికవేత్తలు రావాలి.“ అని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షించారు.

ఎస్సీ, ఎస్టీల‌కు ఖ‌చ్చితంగా భూములు

ఏపీఐఐసీ భూకేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇంకా మరెన్నో ఉన్నాయి. “స్టాంప్‌ డ్యూటీ రద్దు. విద్యుత్‌ ఛార్జీల్లో రాయితీ, రుణాలపై వడ్డీలో రాయితీ, భూకేటాయింపుల్లో రాయితీ, ఎస్జీఎస్టీలో రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్‌ రిజిస్ట్రేషన్‌ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకురావడం జరిగింది.– వీటన్నింటి వల్ల ఇంకా మెరుగ్గా ఎస్సీ, ఎస్టీలలో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు అని సీఎం జ‌గ‌న్ అన్నారు.

ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో

పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ మంచి జరగాలని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. “ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వారి కాళ్ల మీద వారు నిలబడాలి. వారి జీవితాలు సంపూర్ణంగా మార్చాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేశాము. పేదలకు అమ్మ ఒడి పథకం తీసుకున్నా, రైతు భరోసా పథకం తీసుకున్నా, ఆరోగ్యశ్రీ తీసుకున్నా, పెన్షన్ల పెంపు తీసుకున్నా, 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నా… గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ తీసుకున్నా వాటిలో కూడా దాదాపు 82 శాతం ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దక్కాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుల కోసం ఏ ఒక్కరూ కూడా అప్పులపాలు కాకపోవడం జరుగుతోంది.
ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి పథకం కూడా ఎవరికీ మిస్‌ కాకుండా, అవినీతికి తావు లేకుండా, పక్షపాతం లేకుండా అమలు జరుగుతోంది“ అని అన్నారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju