NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇదేంద‌య్యా ఇదిః జ‌గ‌న్ న‌మ్మిన‌బంటుకే ఏపీలో టోక‌రా

AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal

ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి… మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌న్నిహితుడు. సౌమ్యుడైన ఈ రాజ‌కీయ‌వేత్త ఏపీ రాజ‌కీయాల్లో ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేష్‌పై గెలుపు సాధించ‌డం ద్వారా ఆర్కే స‌త్తా సుప‌రిచితం అయింది. అయితే, అలాంటి ఆర్కేకు ఏపీలోనే మోసం జ‌రిగింది. తాజాగా ఓ కంపెనీ ఆయ‌న న‌మ్మిన వ్య‌వ‌సాయంలోనే షాక్ ఇచ్చింది.

ఆర్కే ప్రేమ ఆధారంగా….

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కేకు వ్య‌వ‌సాయం అంటే ఇష్ట‌మ‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ వ్య‌వ‌సాయం ఆధారంగానే ఓ కంపెనీ మోసం చేసింది. విత్తన కంపెనీ చేతిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మోసపోయారు. 14 ఎకరాల్లో పంట వేయగా 5 ఎకరాల్లో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలు ఆర్కే కొనుగోలు చేశారు. పంట నష్టంతో వ్యవసాయశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యేకే కంపెనీ బురిడీ కొట్టించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఆర్కేకు ఇది రెండో షాక్‌

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇటీవ‌ల జ‌రిగిన షాక్‌ల‌లో ఇదో రెండోది. ఆర్కేతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు కొందరు విలేకరులపై సోషల్‌ మీడియాలో టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌, ఎమ్మెల్సీ అనుచరులే దుష్ప్ర‌చారానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన కేసుతో పాటు అదే ఉద్యోగాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు మంగళగిరి సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఆర్కే పేరుతో అదిరిపోయే స్కాం

2017లో ఎమ్మెల్సీ, మంత్రికి అనుచరుడిగా ఉన్న మంగళగిరికి చెందిన గాలి వెంకట లారెన్స్‌ పట్టణంలోని కొత్తపేటకు చెందిన కారంచేటి మణికాంత్‌కు విద్యుత్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.23 లక్షలు తీసుకున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మణికాంత్‌ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్న కోలపల్లి సునిల్‌కుమార్‌ కీలక పాత్ర వెలుగులోకి వచ్చింది. అతనితోపాటు ఎమ్మెల్సీకి మరో సన్నిహితుడు లారెన్స్‌ పేరు బయటకు రావడంతో ఆయ‌న‌ పీఆర్వో దీన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడ వేశాడు. ఎమ్మెల్సీకి కేసు చుట్టుకుంటుందనే భావనతో ఉద్యోగాల పేరిట వసూళ్లకు సంబంధించి అజేయ కల్లం, ఆర్కే, ఓ విలేకరిపై దుష్ప్రచారానికి పూనుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఉదంతం ఆర్కేను ఆయ‌న మ‌నుషులను షాక్‌కు గురి చేసింది.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju