ఏపీ గురించి సింగపూర్ మంత్రి ఏమన్నాడో తెలుసా!

అమరావతి, డిసెంబర్ 27: ఆంద్రప్రధేశ్ రాజధాని అమరావతిలో భాగస్వాములం అయ్యాం, అమరావతి అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సింగపూర్ విదేశీ వ్యవహరాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు మరో సారి భరోసా ఇచ్చారు. సింగపూర్ ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఎస్ ఆర్ నాధన్ ఫెలోషిప్‌ను‌ బుధవారం లోకేష్‌కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతి నిర్మాణంలో పురోగతిపై లోకేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆసక్తిగా ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు, మాదేశానికి మంచి మిత్రుడు, ఆయనతో మా మైత్రి ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు