హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు. హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయనతో పాటు ఆయన కుమారులు శశిధరరెడ్డి, కళాధరరెడ్డి వైసిపిలో చేరారు. వారికి జగన్మోహనరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.
previous post
next post