NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ మూడు రాజధానుల నిర్ణయం వెనకాల సోము వీర్రాజు..!!

మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ నుంచి ఆమోదం రావడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతి అధికారికంగా, అనధికారికంగా అయినా కొంత ఉంటుంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్ణయాలలో జోక్యం చేసుకోకపోవచ్చు గాని అడ్డుకునే విషయంలో ఎలాగైనా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. రాజ్యాంగపరంగా అయినా రాజకీయంగా అయినా లేకపోతే గవర్నర్ రూపంలో అయినా ఏదో ఒకటి చేసి రాజధానిని అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ముద్ర వేయొచ్చు. 

 

3 capitals for Andhra Pradesh mootedసో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి కాకుండా మూడు రాజధానులు నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ నుండి మొదటి నుంచి భిన్న స్వరాలు వస్తున్నాయి. ఏపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఈ విషయంలో ఫస్ట్ నుండి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అమరావతి విషయంలో బిజెపి కేంద్ర పెద్దల నుండి అభిప్రాయం ఎలా ఉందో తెలియదు గాని కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి కి అనుకూలంగా అన్నట్టు గా వ్యవహరిస్తూ వచ్చారు. అదే రీతిలో మిత్రపక్షంగా మధ్యలో బిజెపితో చేతులు కలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో విజయవాడలో కృష్ణానది వంతెన పైన రాజధాని అమరావతి కి అనుకూలంగా కవాతు కూడా చేయాలని అనుకున్నారు. 

 

Andhra Pradesh's three-capital bills get governor's assent ...కానీ అనూహ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు మారిపోయారు. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ప్లేస్ లోకి సోము వీర్రాజు వచ్చారు. ఈ పరిణామంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవటం వెనకాల జగన్ పార్టీకి అదే రీతిలో 3 రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడటం తోనే కన్నా పోస్ట్ పీకేసి సోము వీర్రాజు ని ఆ స్థానంలో బీజేపీ హైకమాండ్ కూర్చో పెట్టినట్లు వార్తలు వచ్చాయి. చర్చలు ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే మరో పక్క మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం కొత్తగా బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు పెద్దగా స్పందించకపోవడం, సో ఇవన్నీ కూడా సోము వీర్రాజు నియామకం అనేది రాజధాని ప్రక్రియలో భాగంగానే జరిగిందనేది మేధావులు చెప్పుకొస్తున్నారు.

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!