NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

CM MK Stalin: స్టాలిన్ ఓ పడి లేచిన కెరటం..! జీవిత చరిత్ర చూసారా..!?

stalin a charismatic leader in tamilnadu politics

CM MK Stalin: ముధవెల్ కరుణానిధి స్టాలిన్.. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తండ్రి తర్వాత కుమారుడు కూడా సీఎం కావడం విశేషం. అంతకంటే ముఖ్యంగా.. తమిళనాడు ప్రజలు, రాజకీయాల్లో బలమైన ముద్ర వేసుకున్న తండ్రి కరుణానిధి ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికి ఆరుసార్లు డీఎంకే అధికారంలోకి వస్తే ప్రతిసారీ కరుణానిధి చరిష్మానే. కానీ.. 14 ఏళ్ల వయుసులో గోపాలపురం యువజన విభాగం ఏర్పాటు చేసి అప్పటినుంచే రాజకీయాలను అవగాహన చేసుకున్న స్టాలిన్ తండ్రికి తగ్గ వారసుడిగానే ఎదిగారు. తండ్రి వెన్నంటే ఉండి.. రాజకీయాలను ఔపోసన పట్టారు. 1953 మార్చి 1న జన్మించిన స్టాలిన్ కు సోవియట్ నాయకుడు స్టాలిన్ పేరు పెట్టుకున్నారు కరుణానిధి. బీఏ చదువు. స్టాలిన్ కు భార్య ఇద్దరు సంతానం. వారిలో ఉదయనిధి స్టాలిన్ చేపాక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

stalin a charismatic leader in tamilnadu politics
stalin a charismatic leader in tamilnadu politics

తమిళనాడులో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే. ఇన్నాళ్లు వీటిని నడిపించిన కరుణానిధి, జయలలిత ప్రస్తుతం లేరు. అన్నాడీఎంకేకు జయలలిత లేని లోటు స్పష్టంగా ఉంది. కానీ.. డీఎంకేకు స్టాలిన్ రూపంలో బలమైన చరిష్మా ఉన్న నాయకుడయ్యారు. ఇందుకు తండ్రి అడుగుజాడల్లో నడవడమే కారణం. 1996లో చెన్నై మేయర్ గా ఉన్నప్పటి నుంచీ తమిళ ప్రజలకు కరుణానిధి వారసుడిగా బలమైన ముద్ర వేసుకున్నారు. 1973 లోనే పార్టీ కమిటీలోకి, 1982 నుంచీ ఇప్పటివరకూ పార్టీ యువజన విభాగాన్ని నడిపిస్తూనే ఉన్నారు. 2003లో పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, 2006లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, 2009లో డిప్యూటీ సీఎంగా రాజకీయ, పాలనానుభవం సంపాదించారు.

ఇద్దరు కుమారుల్లో తనలా అంతటి క్రేజ్, ఇమేజ్, అనుభవం తెచ్చుకున్న స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా కరుణానిధి 2013లోనే ప్రకటించారు. కరుణానిధి వారసుడిగా పార్టీ పగ్గాలు అందుకున్న స్టాలిన్ కు ఇవేమీ బరువుగా అనిపించలేదు. 2019లో ఎంపీ ఎన్నికల్లో ఆయన సారధ్యంలోనే 40 పార్లమెంట్ సీట్లకు 39 సీట్లు గెలిచింది డీఎంకే. దీంతో స్టాలిన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తమిళనాడులో డీఎంకేను మళ్లీ అధికారంలో తీసుకొచ్చేలా ఉపయోగపడింది.. నేడు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసేలా చేసింది. ఇక ప్రస్తుతం ఆయన కర్తవ్యం.. పాలనలో తండ్రిని మరిపించడమే. సుదీర్ఘ అనుభవం ఉన్న స్టాలిన్ కు అది పెద్ద సమస్య కాబోదు..!

author avatar
Muraliak

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!