Subscribe for notification

కాంగ్రెస్ ది ఆత్మహత్య రాజకీయం!! రేవంత్ ఇక పక్కకు తప్పుకున్నట్లే

Share

కాంగ్రెస్లో ఉన్న చిక్కు ఎప్పుడు ఇదే… వారు తమ శత్రువు పై కొట్టాడరు… వారిలో వారే కొట్టుకొని చివరికి శత్రువును విజేత చేస్తారు. ఇది ఇప్పటిది అప్పటి ది కాదు నెహ్రు తరం నుంచి వస్తున్నా కాంగ్రెస్ కల్చర్. అదేమిటో గానీ కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నాయకులు వెళ్లిన కాంగ్రెస్ సంస్కృతి ఊరికినే అంటుకుంటుంది.. అందుకేనేమో భారతదేశంలో అతి పురాతన పార్టీ… చనిపోయేందుకు సిద్ధంగా అవుతున్న పార్టీ అని చరిత్రకారుల సమేత… ఇదంతా ఎందుకు లెండి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వచ్చేద్దాం… కాంగ్రెస్ కు ఉన్న సంస్కృతి మేరకు కాంగ్రెస్ ఇక్కడ తనలోతానే కొట్టుకొని నాయకులు అని చెప్పబడే అహం ఉన్న వ్యక్తుల సమూహం మధ్య మరోసారి పార్టీను గంగలో కలిపి సేందుకు సిద్ధమవుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ స్థానం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కనుమరుగయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ పరిస్థితి సున్నా అయితే తెలంగాణలో కొద్దో గొప్పో పరపతి ఉన్న పార్టీ పరువును నాయకులు తీస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి రేసులో జరిగిన లాబీలు అలకలు హెచ్చరికలు అధిష్టానం వద్ద పలుకుబడులు అన్ని తెలంగాణ పిసిసి త్వరలోనే ముగిసిపోతుంది అన్న సంకేతాన్ని స్పష్టంగా పంపించాయి. నిన్న మొన్నటి వరకు దాదాపు పిసిసి అధ్యక్షుడిగా ఖరారైన రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం తెరమరుగైంది. ఆయనే స్వయంగా తాను పిసిసి అధ్యక్షుడు పదవి కంటే… ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నానని ప్రకటించడం ప్రకటించే టట్లు చేయడం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు పరాకాష్ట.

జీవన్ రెడ్డీ అట!!

ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు రేసులో ఉన్న పేరు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డీ. కరీంనగర్కు చెందిన ఈ నాయకుడు వైయస్సార్ హయాంలో రహదారులు భవనాల శాఖామంత్రిగా పనిచేశారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న జీవన్ రెడ్డి మొదటి నుంచి పీసీసీ అధ్యక్షుడి పదవి ఆశిస్తూ వస్తున్నారు. ఆశించడం మాత్రమే పని మాత్రం జీవన్రెడ్డి చేయరు. నామినేటెడ్ పదవులను పొందుతూ కాంగ్రెస్లో కాలం వెల్లదీస్తున్న ఈ నేత రేవంత్ రెడ్డి పేరును మాత్రం వ్యతిరేకించడంలో ముందున్నారు. నిన్నకాక మొన్న వచ్చిన వారికి పార్టీ అధ్యక్ష పదవిని ఎలా కట్టబెడతారు అంటూ అధిష్టానానికి తమదైన రీతిలో సంకేతాల పంపించడంలో జీవన్రెడ్డి ముందున్నారు.
** ఇక జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కావడంతో పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడిన దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, ఎస్సీ కోటాలో మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సైలెంట్ అయినట్లే అన్నట్లు తెలుస్తోంది. తమకు పదవి రాకపోయినా పర్వాలేదు పక్కనోడి బాగు పడకూడదు అన్న చందం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ కనిపిస్తుంది.

రేవంత్ సరైన ఎంపిక!!

ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని ప్రాజెక్టు చేసుకోవడంలో ప్రస్తుత తెలంగాణ నాయకులంతా వెనుకబడ్డారు అని చెప్పాలి. తెలంగాణ ఇచ్చే సమయంలో టిడిపిలో ఉన్న రేవంత్ రెడ్డి తర్వాత కాలంలో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణను తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీనే ముందుంది అని చెప్పుకోవడంలో వెనుకబడ్డ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలకు మోకాలొడ్డారు.
** రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన దగ్గరనుంచి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి మార్కులే సంపాదించారు. కొడంగల్ లో అసెంబ్లీ సీటు ఓడిపోయినప్పటికీ మల్కాజిగిరి ఇలాంటి దేశంలోనే అతిపెద్ద రెండో లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ను గెలిపించి కు రావడం లో రేవంత్ రెడ్డి పరపతి కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పెరిగింది. దీంతో ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పార్టీ అప్పగించింది.
** పార్టీ పదవిని ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా.. తనకు ఇచ్చిన అన్ని టాస్క్ లను కంప్లీట్ చేసుకుంటూ వడివడిగా రేవంత్రెడ్డి ముందుకు సాగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నూ ఆయనే ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపించారు. తన లోక్సభ స్థానం పరిధిలోని రెండు కార్పొరేటర్ సీట్లను గెలిపించడం లో రేవంత్ రెడ్డి ముందున్నారు. ఇవేవీ రేవంత్ రెడ్డి ఖాతాలో జమ కాలేదు.
** మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతే తీవ్రంగా ప్రశ్నించ గల సమాధానం చెప్పగల సత్తా రేవంత్ ఒక్కడికే సాధ్యం. కాంగ్రెస్లో ఇతర పార్టీ నేతలు అందరికీ అంతటి వాయిస్ లేదు. అందులోనూ రేవంత్ ఎక్కడికెళ్లినా మాస్ లీడర్ గా క్రౌడ్ పుల్లర్ గా మంచి పేరుంది. ఆయన ప్రసంగాలకు యువత ఉర్రూతలూగుతారు.
** ఇన్ని నాయకత్వ లక్షణాలు కోణాలు ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల తో పదవి దక్కలేదు. కాంగ్రెస్లో కావాల్సింది నాయకత్వ లక్షణాలు… నాయకత్వ పటిమ… నాయకత్వ హుందాతనం కాదు… గ్రూపులు కట్టాలి… లాబీయింగ్ చేయాలి… ఫిర్యాదులు చేస్తూ ఉన్నత పదవులు పొందాలని ఇదే కాంగ్రెస్ ట్రేడ్ మార్క్…


Share
Comrade CHE

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

5 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

1 hour ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago