NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ – జగన్ లకి ఝలక్ ఇచ్చిన సుప్రీం కోర్టు !  

ఎప్పటినుండో తెలుగు రాజకీయాలలో వర్గీకరణ పేరిట అనేక రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులు వర్గీకరణ అనే టాపిక్ ని ఆధారం చేసుకుని అనేక రాజకీయాలు చేస్తూ వచ్చారు. అయితే వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు విభేదించే అంశమని చెబుతూ చాలా రాజకీయ పార్టీలు…. ఇలాంటి పరిస్థితుల్లో తప్పించుకునేవి.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కీలక పరీక్ష..! |అయితే తాజాగా అదే సుప్రీంకోర్టు ఇప్పుడు వర్గీకరణ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉప కులాల వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించినట్టు తాజాగా ఇచ్చిన తీర్పులో తేలిపోయింది. ఇదిలా ఉండగా ఎప్పటినుండో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేకమంది ఉద్యమాలు పోరాటాలు చేస్తూ వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో…. రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ లకి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఝలక్ ఇచ్చినట్లయింది.

గతంలోనే ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ….. దళిత నాయకులు అనేక మంది పోరాటం చేస్తూ వచ్చారు. ఎస్టీ రిజర్వేషన్ అంశం లో ఒక సామాజిక వర్గానికి మాత్రమే మేలు జరుగుతుందని…. వెంటనే ఈ విషయంలో వర్గీకరణ జరిగితే సమన్యాయం చేసినట్లవుతుందని చాలామంది దళిత నాయకులు పోరాటాలు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో వర్గీకరణ అనేది కష్టమని, న్యాయస్థానాలు ఒప్పుకోవని అధికారంలో ఉన్న పార్టీలు నచ్చ చెప్పుకుంటూ కాలం వెళ్లబుచ్చారు.

కానీ తాజాగా సుప్రీంకోర్టు… . వర్గీకరణ కీ సంబంధించి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేతలకు తాజా తీర్పు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టినట్లు అయింది. తెలంగాణలో ఆదివాసీలకు మరియు లంబాడీలకు ఈ విషయంలో ఎప్పటినుండో వివాదం నెలకొని ఉంది. ఇదే రీతిలో ఆంధ్రాలో మాదిగలకు మరియు మాల సామాజిక వర్గానికి మధ్య కూడా వర్గీకరణ వివాదం నెలకొని ఉంది. దీంతో తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ పేరుతో మళ్లీ రాజకీయాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju