NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్‌, లోకేష్ ఒక గ్రూప్‌… జ‌గ‌న్ మాత్రం వేరే కేట‌గిరి….

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తన‌యుడైన మంత్రి కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడైన మాజీ మంత్రి నారా లోకేష్ ఒక కేట‌గిరిలోకి వ‌స్తే…. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ర‌థ‌సార‌థి, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం మ‌రో కేట‌గిరీలోకి వ‌స్తారట‌.

ఔనా!? ఏంటి ఆ కేట‌గిరీ? ఎవ‌రు వీరిని అలా విభ‌జించింది? అని ఆలోచిస్తున్నారా? ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ. కేటీఆర్‌, లోకేష్ మంత్రులు కాబ‌ట్టి ఒక కేట‌గిరీలో, వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కాబ‌ట్టి మ‌రో కేట‌గిరీలోకి రావ‌డం స‌హ‌జ‌మే క‌దా? అని మీరు అనుకుంటున్నారా? కాదండోయ్‌. ముగ్గురు యువ‌నేత‌ల‌ను ఇలా రెండు కేట‌గిరీలుగా విభ‌జించేందుకు తెలుగుదేశం వారి లెక్క‌లు వారికి ఉన్నాయి.

కేటీఆర్ , లోకేష్ ఏం చేస్తున్నారంటే….

గ‌త కొద్దికాలంగా టీడీపీ నేత‌లు ట్విట్టర్లో ఎక్కువ‌గా ద‌ర్శ‌నం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వారిలో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఒక‌రు. ఆయ‌నే తాజాగా తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌కు మ‌ధ్య ఉన్న సారుప్య‌త‌ను, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైవిధ్య‌త‌ను వివ్లేషించారు. ఇంత‌కీ ఆయ‌న ఏం ట్వీట్ చేశారంటే… “హైదరాబాద్‌లో మునిగిన కాలనీల్లో కేటీఆర్ తిరుగుతున్నారు. గుంటూరు జిల్లాలో మునిగిన పొలాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. జగన్ రెడ్డి తాడేపల్లి రాజ పరాసాదంలో సేద తీరుతున్నారు. ప్రధాని సమయం ఇస్తే జడ్జీలపై కంప్లయింట్లు పట్టుకొని ఢిల్లీకి పోవడం తప్ప దొర వారు వరదల్లో, బురదల్లో కాలు పెట్టారేమో?“ అంటూ వ‌ర్షం కార‌ణంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను త‌న‌దైన శైలిలో విశ్లేషించారు, ఏపీ ముఖ్య‌మంత్రికి, తెలంగాణ మంత్రికి, త‌మ పార్టీ యువనేత‌కు మ‌ధ్య లింక్ పెట్టేశారు. ఈ పోలిక‌పై అధికార వైసీపీ నేత‌ల స్పంద‌న ఏంటో మ‌రి!

కేటీఆర్ నాలుగో రోజు కూడా….

ఇక హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల విష‌యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ అల‌ర్ట్‌గానే ఉన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద‌ల ముందున్న సాదార‌ణ స్థితికి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ అధికారుల‌ను ఆయ‌న‌ ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌తో క‌లిసి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి కేటీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తీసుకువ‌చ్చే అన్ని చ‌ర్య‌ల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అందుకు స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని తెలిపారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్, క్రిమీసంహార‌క ద్రావ‌నాల‌ను అన్ని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాల‌ని ఆదేశించారు. ఎంట‌మాల‌జి బృందాల ద్వారా కెమిక‌ల్స్ స్ప్రే చేయించాల‌ని సూచించారు. స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌, స్ప్రేయింగ్‌కు అవ‌స‌ర‌మైతే అద‌నంగా వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో నిలిచిన నీళ్ల‌ను తొల‌గించుట‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల వ‌ల‌న నాలాలు, రోడ్ల‌పై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బుర‌ద‌ను, భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాలు, శిథిలాల‌ను తొల‌గించుట‌కు అవ‌స‌ర‌మైన సిబ్బందిని, అద‌నపు వాహ‌నాల‌ను వినియోగించాల‌ని తెలిపారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌తో పాటు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మొబైల్ మెడిక‌ల్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌ని తెలిపారు.

author avatar
sridhar

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N