NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అంబేద్కర్ విగ్రహంపై అప్పుడే వివాదం మొదలు..!!

విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. దానికి శంకుస్థాపన కూడా చేశారు. 2022 నాటికి దీన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ విగ్రహ ఏర్పాటుపై అప్పుడే కొన్ని పక్షాల నుంచి వివాదాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా గతంలోనే అమరావతిలో కృష్ణా నది వద్ద ఈ మేరకు 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు తలచారు. కానీ అది కార్యరూపం దాల్చకుండానే ఆయన సీఎం కుర్చీ దిగారు.

తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఖాళీగా ఉన్న అతి పెద్ద మైదానం పిడబ్ల్యుడి గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పనుండటం కొన్ని వర్గాలకు సంతోషదాయకం అయినా కొన్ని వర్గాల నుండి మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అది విజయవాడ లోని అతి పెద్ద మైదానం. రాజకీయ పార్టీలు ఎటువంటి మీటింగులకైనా, ఎటువంటి ఎగ్జిబిషన్ల కైనా విజయవాడ నగరానికి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమం నిర్వహించాలన్నా స్వరాజ్య మైదానంలోనే ఇప్పటి వరకు జరుగుతుండేవి. ఆ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేస్తే ఖాళీ పెద్ద మైదానం పోతుందని దాని అవసరం వస్తే ఎక్కడికి వెళ్లాలని విజయవాడలో కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ మేరకు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విగ్రహ ఏర్పాటు అమరావతిలోనే చేయాలని, రాజధాని సంకల్పం బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను గతంలోనే ఈ పిడబ్ల్యుడి గ్రౌండ్స్ విషయమై కోర్టుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే పరోక్షంగా ఈ నిర్ణయంపై మళ్లీ తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే వడ్డే గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఆంగ్ల మాధ్యమం వివాదంపై కూడా ఆయనే మొదట కోర్టుకు వెళ్లారు. ఈయన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు దగ్గరి బంధువు. వడ్డే మనుమరాలిని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బలరామ్, వెంకటేష్ వైఎస్ఆర్ సీపీలో కొనసాగుతుండగా వారి ఆప్తుడు, బంధువు అయిన శోభనాద్రీశ్వరరావు ఈ రకంగా ప్రభుత్వంకు వ్యతిరేకంగా పిటిషన్ లు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.

నిధులు దుబారా అంటూ ఆరోపణలు

స్థలం విషయమై వివాదం ఆలా ఉండగా మరో వైపు ఈ ప్రాజెక్టుకు 200 కోట్లు నిధులు కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికే అప్పుల్లో ఉండటం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలా రెండు వందల కోట్లు కేటాయించి విగ్రహం నెలకొల్పడం అవసరమా అంటూ మరో వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం పార్టీ తాము తలపెట్టినట్లు కృష్ణానది మధ్యలో ఇలా అంబేద్కర్ విగ్రహం పెద్దది నెలకొల్పితే ఆకర్షణీయంగా ఉంటుందని, రాజధాని అమరావతికి కూడా అద్భుతమైన కట్టడంగా నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఇలా జగన్మోహన రెడ్డి తలపెట్టిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ అనేక రకమైన వాదనలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కలేదు కానీ ఒకవేళ కోర్టు మెట్లు ఎక్కితే మళ్లీ ఎప్పటిలాగానే వ్యతిరేక తీర్పు వస్తుందా, అనుకూల తీర్పు వస్తుందా అనేది చర్చగా మారుతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!