NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

T Congress: టీ కాంగ్రెస్ సీనియర్ లపై అధిష్టానం సీరియస్ .. అసమ్మతి నేతల సమావేశంపై సందిగ్దత

T Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై పలువురు సీనియర్ నేతలు మొదటి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందే ఒక సారి మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు నేడు అశోకా హోటల్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. పంజాబ్ లో సిద్ధూను పీసీసీ అధ్యక్షుడుగా చేసిన తరువాత ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో ఇక్కడి టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ కు పీసీసీ బాధ్యతల నుండి తొలగించి పార్టీలో మొదటి నుండి ఉన్న వారికి పీసీసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ పై ముందుగా సమావేశమై త్వరలో ఢిల్లీకి వెళ్లి సోనియా గాందీ, రాహుల్ గాంధీకి తమ నిర్ణయం చెప్పాలని సీనియర్ లు భావిస్తున్నారు.

T Congress seniour leaders meeting against Revanth reddy
T Congress seniour leaders meeting against Revanth reddy

T Congress: వీ హనుమంతరావు నాయకత్వంలో..

ఇదే క్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. పలువురు సీనియర్ నేతలు గ్రూపుగా సమావేశం అవుతున్న విషయం తెలిసిన పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ గాంధీలతో చెప్పాలే కానీ ఇలా సమావేశాలను పెట్టి పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. పార్టీ అధిష్టానం నుండి సీనియర్ నేతలకు ఫోన్ లు రావడంతో సమావేశంపై అనిశ్చితి నెలకొంది. సమావేశం జరపతలపెట్టిన అశోకా హోటల్ వద్దకు సీనియర్ నేతలు వీ హనుమంతరావు, జగ్గారెడ్డి లు మాత్రమే చేరుకున్నారు. ఆ తరువాత మర్రి శశిధర్ రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురు నాయకులతో సమావేశం అయ్యారు.

రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు అంటూ…

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియా మాట్లాడుతూ తమపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అజెండా ఫాలో కాకుండా ఆయన సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారని అందుకే తాము మీడియా ముందుకు వచ్చామన్నారు. పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదన్నారు. పార్టీలో సమన్వయం కొరవడిందని జగ్గారెడ్డి అన్నారు.

పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినప్పటికీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటున్నారనే భావనలో ఉన్నారు. సీనియర్ నేతలను గౌరవించడం లేదంటూ ఆయన నాయకత్వంలో పని చేయడానికి సముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలువురు సీనియర్ నేతల సూచనల నేపథ్యంలో రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా బీజేపీకి వైపుకు చూస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N